AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఏందిరా ఆజామూ.. ఇక మారవా.. పీఎస్‌ఎల్ వద్దు, ఐపీఎల్ ముద్దన్నోడి చేతిలో చావుదెబ్బ..

Babar Azam: బాబర్ అజామ్ ఆట కేవలం 2 బంతుల్లోనే ముగిసింది. PSL నుంచి వైదొలగాలనుకున్న ప్లేయర్ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. అతని బ్యాట్ నుంచి పరుగులు రావడం కష్టమవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో విఫలమైన తర్వాత, బాబర్ పీఎస్‌ఎల్‌పై ఆశలు పెట్టుకున్నాడు. కానీ, ఇక్కడ కూడా బాబర్ ఆజంకు నిరాశే ఎదురైంది.

Video: ఏందిరా ఆజామూ.. ఇక మారవా.. పీఎస్‌ఎల్ వద్దు, ఐపీఎల్ ముద్దన్నోడి చేతిలో చావుదెబ్బ..
Babar Azam Psl 2025
Follow us
Venkata Chari

|

Updated on: Apr 13, 2025 | 6:13 PM

Babar Azam: రోజులు మారాయి, నెలలు మారాయి, ప్రదేశాలు కూడా మారాయి. కానీ, మారకుండా ఉన్నది మాత్రం బాబర్ ఆజం విధి. పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజం గడ్డుకాలం ఇంకా ముగిసినట్లు లేదు. గత కొన్ని నెలలుగా బ్యాటింగ్‌లో విఫలమవుతున్న బాబర్.. ఇప్పుడు కొత్త టోర్నమెంట్‌లో కూడా ఘోరంగా విఫలమయ్యాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో తన తొలి మ్యాచ్‌లో బాబర్ కేవలం 2 బంతుల్లోనే పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. పెషావర్ జల్మీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బాబర్ ఆ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వడంలో విఫలమయ్యాడు.

ఇటీవల, ఛాంపియన్స్ ట్రోఫీలో బాబర్ ఆజం బ్యాట్ పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. అంతకు ముందు, బాబర్ టీ20 ప్రపంచ కప్‌లో కూడా విఫలమయ్యాడు. వీటన్నిటి మధ్య, బాబర్ టెస్ట్, వన్డే క్రికెట్‌లో కూడా భారీ లేదా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. వీటన్నిటి కారణంగా, అతను పాకిస్తాన్ జట్టు కెప్టెన్సీని వదులుకోవడమే కాకుండా, టీ20 జట్టులో తన స్థానాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో, బాబర్ తిరిగి రావడానికి ఉన్న ఏకైక అవకాశం PSLలో బలమైన ప్రదర్శన మాత్రమేనని అంతా భావించారు. కానీ, ఇక్కడ కూడా బాబర్ తీవ్రంగా నిరాశ పరిచాడు.

తొలి మ్యాచ్ తొలి ఓవర్లోనే విఫలమైన బాబర్..

ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లోనే ఏప్రిల్ 12వ తేదీ శనివారం బాబర్ ఆజం ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ ఇచ్చిన 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బాబర్ అజామ్ తొలి ఓవర్లోనే ఔటయ్యాడు. తన రెండవ బంతికే బాబర్ కవర్ ఫీల్డర్‌కి సులభమైన క్యాచ్ ఇచ్చాడు. ఈ విధంగా బాబర్ ఆజం బ్యాట్‌ మౌనంగా ఉండిపోయింది. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్ కోసం రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చి, ఆ తర్వాత మళ్లీ రిటైర్ అయిన ఎడమచేతి వాటం పేసర్ మహ్మద్ అమీర్ విసిరిన అద్భుత బంతికి బాబర్ అజామ్‌ పెవిలియన్ చేరాడు.

పీఎస్‌ఎల్‌ను వదిలి ఐపీఎల్‌లో ఆడాలనే కోరిక..

కాగా, ఇటీవల మహ్మద్ ఆమీర్ తనకు అవకాశం వస్తే పీఎస్ఎల్ వదిలి ఐపీఎల్ ఆడటానికి వెళ్తానని వెల్లడించాడు. ఈ ఎడమచేతి వాటం స్టార్ పేసర్ బ్రిటిష్ పౌరసత్వం పొందాడు. 2026 నుంచి IPLలో ఆడటానికి అర్హత పొందుతాడు. ఇటువంటి పరిస్థితిలో ఏదైనా ఫ్రాంచైజీ తనకు అవకాశం ఇస్తుందని ఆమీర్ ఆశిస్తున్నాడు. పీఎస్ఎల్ లేదా ఇండియన్ టీ20 లీగ్‌లో ఏది ఎంచుకుంటారనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఐపీఎల్‌ను మాత్రమే ఎంచుకుంటానని బదులిచ్చాడు అమీర్.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..