AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఢిల్లీతో మ్యాచ్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్న హార్ధిక్‌ పాండ్యా! ఇంతలో ఊహించని అతిథి వచ్చి..

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సమయంలో ఓ రోబోట్ కెమెరా గ్రౌండ్లో హల్చల్ చేసింది. ఇది కుక్కలా కనిపించే ఈ రోబోట్ కెమెరా, ఆటగాళ్ల కదలికలను రికార్డ్ చేస్తుంది. హార్ధిక్ పాండ్యాతో సహా అనేక మంది ఆటగాళ్లు దీనితో ఆశ్చర్యపోయారు.

IPL 2025: ఢిల్లీతో మ్యాచ్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్న హార్ధిక్‌ పాండ్యా! ఇంతలో ఊహించని అతిథి వచ్చి..
Hardik Pandya With Robot Ca
Follow us
SN Pasha

|

Updated on: Apr 13, 2025 | 6:06 PM

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఢిల్లీలోని అరున్‌ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. అయితే.. మ్యాచ్‌ కి ముందు ముంబై కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఇంతలో గ్రౌండ్‌లోకి ఓ అతిథి వచ్చింది. దాన్ని చూసి.. పాండ్యాతో పాటు మిగతా ముంబై ఆటగాళ్లు, ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ కూడా షాక్‌ అయ్యారు. ఇంతకీ ఆ అతిథి ఎవరు ఏంటి అనుకుంటున్నారా? ఓ రోబాట్‌ కెమెరా. ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ టీమ్‌లోకి కొత్తగా చేరిందంటూ కామెంటేటర్లు పేర్కొన్నారు. చూసేందుకు చిన్న కుక్కలా కనిపిస్తోంది.

నడుస్తుంది, పరిగెడుతుంది, షేక్‌ హ్యాండ్‌ ఇస్తుంది, మనిషి నిల్చున్నట్లు రెండు కాళ్లపై నిల్చుంటుంది. చూసేందుకు ఎంతో ముచ్చటగా కనిపిస్తోంది. గ్రౌండ్‌లో అటూ ఇటూ తిరుగుతూ.. ఆటగాళ్ల కదలికలు క్యాప్చర్‌ చేయనుంది. ఇది చాలా స్పెషల్‌ రోబాట్‌ కెమెరా. బ్రాడ్‌ కాస్టింగ్‌ టీమ్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలువనుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోసల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా పీఎస్‌ఎల్‌ ఓపెనింగ్‌ సెర్మనీ సందర్భంగా రాకెట్‌ మ్యాన్‌ను పీసీబీ తీసుకొచ్చింది. కానీ, మన ఐపీఎల్‌లో అంతకు మించిన టెక్నాలజీని వాడుతున్నాం అంటూ క్రికెట్‌ అభిమానులు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యూరప్‌లో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ.. చీకట్లో జనం!
యూరప్‌లో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ.. చీకట్లో జనం!
ఐపీఎల్ కంటెంట్ పై బీసీసీఐ ఉక్కుపాదం: యూట్యూబ్ షాక్!
ఐపీఎల్ కంటెంట్ పై బీసీసీఐ ఉక్కుపాదం: యూట్యూబ్ షాక్!
ఏపీలో సమంతకు గుడి ఉందని తెల్సా.. ఈసారి మరో విగ్రహం..
ఏపీలో సమంతకు గుడి ఉందని తెల్సా.. ఈసారి మరో విగ్రహం..
కుండలో నీళ్లు వేగంగా కూలైపోతాయి.. ఈ ఒక్క సింపుల్ టిప్‌తో..
కుండలో నీళ్లు వేగంగా కూలైపోతాయి.. ఈ ఒక్క సింపుల్ టిప్‌తో..
అక్షయతృతీయన లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించేందుకు ఒక్కపని చేయండి
అక్షయతృతీయన లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించేందుకు ఒక్కపని చేయండి
పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిందేః ఫరూక్ అబ్దుల్లా
పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిందేః ఫరూక్ అబ్దుల్లా
18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి.. ట్రోఫీ లేకున్నా RCB తోపే
18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి.. ట్రోఫీ లేకున్నా RCB తోపే
టీ బ్రేక్‌లో టేస్టీ వడలు.. ఎవ్వరైనా చేసేయొచ్చిలా...
టీ బ్రేక్‌లో టేస్టీ వడలు.. ఎవ్వరైనా చేసేయొచ్చిలా...
సినిమాల్లోకి నటి ఊర్వశి కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సినిమాల్లోకి నటి ఊర్వశి కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
పబ్లిక్ మీటింగ్‌లో ASPపై చేయెత్తిన CM సిద్ధరామయ్య.. వీడియో చూశారా
పబ్లిక్ మీటింగ్‌లో ASPపై చేయెత్తిన CM సిద్ధరామయ్య.. వీడియో చూశారా