RR vs RCB: చెలరేగిన జైస్వాల్.. తుస్సుమన్న శాంసన్.. మరి స్లో పిచ్‌లో ఆర్‌సీబీ టార్గెట్ ఛేదించేనా?
Rajasthan Royals vs Royal Challengers Bengaluru, 28th Match: ఐపీఎల్-18లో ఈ రోజు తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కు 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో RCB టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.

Rajasthan Royals vs Royal Challengers Bengaluru, 28th Match: ఐపీఎల్-18లో భాగంగా ఈ రోజు తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడుతున్నాయి. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. దీంతో బెంగళూరుకు 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
రాజస్థాన్‌కు చెందిన యశస్వి జైస్వాల్ అర్ధశతకం సాధించాడు. యశస్వి 47 బంతుల్లో 75 పరుగులు చేశాడు. అతనితో పాటు, ధ్రువ్ జురెల్ అజేయంగా 35 పరుగులు, రియాన్ పరాగ్ 30 పరుగులు చేశాడు. బెంగళూరు తరపున యశ్ దయాళ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
Innings Break!#RR post a competitive 1⃣7⃣3⃣ / 4⃣ on the back of Yashasvi Jaiswal’s impressive 75(47) 👌
Will #RCB chase this down and seal 2⃣ points? 🤔
Updates ▶ https://t.co/rqkY49M8lt#TATAIPL | #RRvRCB | @rajasthanroyals | @RCBTweets pic.twitter.com/BHf8fMx4qR
— IndianPremierLeague (@IPL) April 13, 2025
రెండు జట్ల ప్లేయింగ్-11..
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహిష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.
ఇంపాక్ట్ ప్లేయర్స్: శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్, ఫజల్హాక్ ఫరూకీ, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), క్రునాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ.
ఇంపాక్ట్ ప్లేయర్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలాం, మనోజ్ భండాగే, జాకబ్ బెతేల్, స్వప్నిల్ సింగ్
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..