AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అభిమానిని గాయపరిచిన పూరన్ భారీ సిక్స్.. కట్‌చేస్తే.. చికిత్స తర్వాత ఊహించని షాకిచ్చాడుగా

Fan Injured From Nicholas Pooran Powerful Six: నికోలస్ పూరన్ 61 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పూరన్ విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టాండ్స్‌లో కూర్చున్న ప్రేక్షకుడికి ఒక సిక్స్ తగిలి గాయపడ్డాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

Video: అభిమానిని గాయపరిచిన పూరన్ భారీ సిక్స్.. కట్‌చేస్తే.. చికిత్స తర్వాత ఊహించని షాకిచ్చాడుగా
Fan Injured From Nicholas Pooran Powerful Six
Follow us
Venkata Chari

|

Updated on: Apr 13, 2025 | 4:56 PM

Fan Injured From Nicholas Pooran Powerful Six: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా 26వ మ్యాచ్ ఏప్రిల్ 12న లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు లక్నో గుజరాత్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ మరోసారి తన ప్రతిభను ప్రదర్శించాడు. అతను గుజరాత్ బౌలర్లను చిత్తు చేశాడు. ప్రస్తుతం పురాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతని బ్యాట్ నుంచి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు.

‘ఇబ్బంది’గా మారిన నికోలస్ పూరన్ సిక్స్..

నికోలస్ పూరన్ సిక్స్ కొట్టడంతో ఓ ప్రేక్షకుడు గాయపడ్డాడు. ఆ వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో గాయపడిన ప్రేక్షకుడు తలకు కట్టు కట్టుకుని కనిపిస్తున్నాడు. అయితే, ఈ ప్రేక్షకుడి తలకు చాలానే కుట్లు పడ్డాయంట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గాయపడిన తర్వాత కూడా, ఆ అభిమాని చికిత్స చేయించుకుని, ఆ తర్వాత మ్యాచ్ చూడటానికి లక్నోలోని ఎకానా స్టేడియానికి తిరిగి వెళ్ళాడంట. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ 7 సిక్సర్లు కొట్టాడు. వాటిలో ఒకటి ఈ ప్రేక్షకుడి తలకు తగిలింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Video: కాటేరమ్మ పెద్ద కొడుకును కెలికి తన్నించుకున్న మ్యాడ్ మ్యాక్సీ.. అంపైర్ సాక్షిగా పచ్చి బూతులతో..

నికోలస్ పూరన్ తుఫాను ఇన్నింగ్స్..

శనివారం గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తుఫాన్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ 34 బంతుల్లో 61 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ 179.41 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి 1 ఫోర్, 7 సిక్సర్లు కొట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

IPL 2025 లో అత్యధిక పరుగులు చేసిన పూరన్..

ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు నికోలస్ పూరన్ అనే సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 215 స్ట్రైక్ రేట్‌తో 349 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్‌లో పూరన్ బ్యాట్ నుంచి 26 ఫోర్లు, 31 సిక్సర్లు కనిపించాయి. అతను నాలుగు అర్ధ సెంచరీలు కూడా సాధించాడు.

ఇది కూడా చదవండి: 200+ స్ట్రైక్ రేట్.. 80 దాటిన సగటు.. ఐపీఎల్ 2025లో ఒకే ఒక్క మెంటలోడు.. బాల్ చూస్తే ఈ బాదుడేంది భయ్యా

మ్యాచ్‌లో ఎవరు గెలిచారంటే..

నికోలస్ పూరన్ (61), ఐడెన్ మార్క్రమ్ (58), ఆయుష్ బదోని (28 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో లక్నో సూపర్‌జెయింట్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే ఓడించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. సాయి సుదర్శన్ (56), కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (60) అర్ధ సెంచరీలతో ఏకంగా ఇద్దరి మధ్య 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొంది. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది.

ఆ తర్వాత లక్నో 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 186 పరుగులు చేసి సులభమైన విజయాన్ని నమోదు చేసింది. ఆరు మ్యాచ్‌ల్లో లక్నోకు ఇది నాలుగో విజయం కాగా, ఆరు మ్యాచ్‌ల్లో గుజరాత్‌కు ఇది రెండో ఓటమి. ఈ ఓటమితో గుజరాత్ పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతుండగా, లక్నో మూడవ స్థానానికి చేరుకుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..