Video: కాటేరమ్మ పెద్ద కొడుకును కెలికి తన్నించుకున్న మ్యాడ్ మ్యాక్సీ.. అంపైర్ సాక్షిగా పచ్చి బూతులతో..
Glenn Maxwell and Travis Head Fight Video: ఈ సంఘటన క్రికెట్ అభిమానులలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆటలో ఇలాంటి సంఘటనలు సాధారణమే అయినప్పటికీ, ఈ గొడవ ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య జరగడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Glenn Maxwell and Travis Head Fight Video: ఐపీఎల్ 2025లో భాగంగా 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం రికార్డ్ ఛేదనతో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ జట్టు 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తోన్న తరుణంలో అభిషేక్, ట్రావిస్ హెడ్ ఊచకోతలతో ఉప్పల్ ఊగిపోతోంది. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్వెల్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సంఘటన హైదరాబాద్ ఇన్నింగ్స్ తొమ్మిదవ ఓవర్లో జరిగింది. గ్లెన్ మాక్స్వెల్ బౌలింగ్ చేస్తోన్న ఈ ఓవర్లో మూడవ, నాల్గవ బంతుల్లో హెడ్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత బంతిని ట్రావిస్ హెడ్ బౌలర్ మాక్స్‌వెల్ వైపు కొట్టాడు. ఆ వెంటనే మాక్స్‌వెల్ బంతిని స్టంప్‌ల వైపు విసిరి హెడ్‌ను రనౌట్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో హెడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మార్కస్ స్టోయినిస్, అంపైర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింపజేశారు. ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో వరుస సిక్స్‌లు కొట్టడం కూడా ఈ వాగ్వాదానికి కారణమైంది.
ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్వెల్ వాగ్వాదం వీడియో..
Fight between 2 australia players #Maxwell #TravisHead #SRHvsPBKS pic.twitter.com/1oVOBBsGYK
— Abhijeet vijay (@Abhij1997) April 12, 2025
ఈ సంఘటన క్రికెట్ అభిమానులలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆటలో ఇలాంటి సంఘటనలు సాధారణమే అయినప్పటికీ, ఈ గొడవ ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య జరగడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ రికార్డు ఛేదనలో హెడ్ కేవలం 37 బంతుల్లో 66 పరుగులతో పంజాబ్ బౌలర్లపై ప్రతాపం చూపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. హెడ్ వికెట్‌ను యుజ్వేంద్ర చాహల్ ఖతాలో చేరగా, మాక్స్‌వెల్ బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్‌తో కౌంటరిచ్చాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..