AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs RCB IPL 2025 Match Prediction: ఐపీఎల్ 2025లోనే అసలైన మ్యాచ్‌కు రంగం సిద్ధం.. చివరి బంతి వరకు ఉత్కంఠే

Rajasthan Royals vs Royal Challengers Bengaluru Preview: ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ తమ హోమ్ గ్రౌండ్‌లో ఆడటం వారికి కొంత అడ్వాంటేజ్‌గా ఉండొచ్చు. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బయటి వేదికలపై అద్భుతంగా రాణిస్తోంది. బెంగళూరు బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. కానీ, రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఎంతవరకు కట్టడి చేస్తారనేది చూడాలి.

RR vs RCB IPL 2025 Match Prediction: ఐపీఎల్ 2025లోనే అసలైన మ్యాచ్‌కు రంగం సిద్ధం.. చివరి బంతి వరకు ఉత్కంఠే
Rajasthan Royals Vs Royal Challengers Bengaluru
Follow us
Venkata Chari

|

Updated on: Apr 13, 2025 | 8:38 AM

Rajasthan Royals vs Royal Challengers Bengaluru Preview: ఐపీఎల్ 2025లో భాగంగా 28వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కూడా చాలా కీలకం కానుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ , బెంగళూరు మధ్య జరిగిన అన్ని మ్యాచ్‌లు హోరాహోరీగానే సాగాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 32 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ సమయంలో ఆర్‌సీబీ 15 మ్యాచ్‌ల్లో గెలవగా, రాజస్థాన్ కూడా 14 మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల ఫలితం తేలలేదు.

రాజస్థాన్ రాయల్స్:

గువహటిలో రెండు “హోమ్” మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్.. ఈ సీజన్‌లో మొదటిసారిగా తమ హోమ్ గ్రౌండ్‌లో ఆడనుంది. అయితే, రాజస్థాన్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి, మూడింట ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్‌తో తమ చివరి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోవడంతో ఈ మ్యాచ్‌లో గెలవాలని రాజస్థాన్ రాయల్స్ పట్టుదలగా ఉంది.

బలాలు:

జోఫ్రా ఆర్చర్ తిరిగి ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద ఊరటనిస్తోంది. అతని వేగంతోపాటు పవర్ ప్లేలో వికెట్లు తీసే సామర్థ్యం కలిగి ఉన్నాడు.

సందీప్ శర్మ కొత్త బంతితోపాటు డెత్ ఓవర్లలో మంచి బౌలింగ్ చేయగలడు.

కెప్టెన్ సంజూ శాంసన్ మిడిల్ ఆర్డర్‌లో స్థిరత్వాన్ని అందించడంలో సిద్ధహస్తుడు. అయితే, శాంసన్‌కు అండగా నిలిచే ప్లేయర్ లేకపోవడం ఆందోళనగా నిలుస్తోంది.

యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడే ఓపెనర్. ఇప్పటి వరకు ఆకట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో తన పాత ఫాంలోకి రావాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.

బలహీనతలు:

మధ్య ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ (7-15) ఎక్కువ వికెట్లు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.

అలాగే, రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్‌లో స్థిరత్వం కొరవడింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో బాగానే రాణించారు. ముఖ్యంగా బయటి వేదికలపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన మెరుగ్గా ఉంది. కోల్‌కతా, చెన్నై, ముంబైలలో విజయాలు సాధించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

బలాలు:

విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. జట్టుకు వెన్నెముకలా ఉన్నాడు.

కెప్టెన్ రాజత్ పాటిదార్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్‌లతో కూడిన పేస్ బౌలింగ్ విభాగం బలంగా ఉంది.

బలహీనతలు:

చిన్నస్వామి స్టేడియంలో వరుస ఓటములతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆందోళనలో ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్ బౌలింగ్‌లో మరింత మెరుగుదల అవసరం.

తుది అంచనా:

ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ తమ హోమ్ గ్రౌండ్‌లో ఆడటం వారికి కొంత అడ్వాంటేజ్‌గా ఉండొచ్చు. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బయటి వేదికలపై అద్భుతంగా రాణిస్తోంది. బెంగళూరు బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. కానీ, రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఎంతవరకు కట్టడి చేస్తారనేది చూడాలి.

వీళ్లపైనే అందరి ఫోకస్:

రాజస్థాన్ రాయల్స్: జోఫ్రా ఆర్చర్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, రాజత్ పాటిదార్, జోష్ హేజిల్‌వుడ్.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, సాయంత్రం వేళ మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది.

మొత్తానికి, ఇరు జట్లు గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతుండటంతో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ని ఫ్యాన్స్ చూసే అవకాశం ఉంది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు సామ్సన్(సి), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మైర్, వనిందు హసరంగా/ ఫజల్‌హాక్ ఫరూఖీ, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, కుమార్ కార్తికేయ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పాడిక్కల్, రజత్ పాటిదార్(కె), లియామ్ లివింగ్‌స్టోన్/ జాకబ్ బెథెల్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాల్, సుయాష్ శర్మ.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..