- Telugu News Photo Gallery Cricket photos IPL 2025: Records tumble as SRH Abhishek Sharma amasses highest score by Indian in IPL Against PBKS
IPL 2025: ఏం కొట్టుడు భయ్యా.! 14 ఫోర్లు, 10 సిక్సర్లతో మెంటలోడి మరణమాస్.. పెద్దపులి పెను తుఫాన్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అభిషేక్ శర్మ 55 బంతుల్లో 10 సిక్సర్లు, 14 ఫోర్లతో 141 పరుగులు చేశాడు. ఆ వివరాలు..
Updated on: Apr 13, 2025 | 9:23 AM

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కంబ్యాక్ ఇచ్చింది. ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచారు. అభిషేక్, ట్రావిస్ హెడ్ కలిసి మొదటి వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సీజన్‌లో ఇదే అతిపెద్ద పార్టనర్‌షిప్.

కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ తన ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. 250 స్ట్రైక్‌రేట్‌తో మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 141 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచారు.

ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో రెండో అతిపెద్ద టార్గెట్‌ను చేధించిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. మొదట స్థానంలో 2024 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ 262 పరుగులను కేకేఆర్ జట్టుపై చేధించింది.

అలాగే ఐపీఎల్ చరిత్రలో ఒక్క ఉప్పల్ స్టేడియంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తొమ్మిది సార్లు పంజాబ్‌పై విజయాలు సాధించింది. ఈ లిస్టులో కేకేఆర్‌పై వాంఖేడేలో ముంబై పదిసార్లు గెలవగా.. కోల్‌కతాలో పంజాబ్‌పై కేకేఆర్ తొమ్మిది సార్లు గెలిచింది.

అలాగే పంజాబ్ కింగ్స్‌పై 2015-25 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా ఎనిమిది మ్యాచ్‌లలో గెలిచింది. ఇక ఈ మ్యాచ్‌తో SRH సీజన్‌లో రెండో మ్యాచ్ గెలిచింది.

ఇక ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ(141)ది మూడో హయ్యస్ట్ వ్యక్తిగత స్కోర్ ఇది. అలాగే ఓ SRH బ్యాటర్ అత్యధిక సిక్సర్లు(10) కొట్టడం ఇదే తొలిసారి.

అలాగే ఐపీఎల్‌లో రెండో అత్యధిక బౌండరీలు సాధించిన ఆటగాడిగా అభిషేక్ శర్మ చరిత్రకెక్కాడు. ఇతడు ఒక్క ఇన్నింగ్స్‌లో 24 బౌండరీలు బాదాడు. మొదటి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు.

అభిషేక్ శర్మ 19 బంతుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేయడంతో మూడో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ సాధించిన SRH బ్యాటర్‌గా నిలిచాడు అలాగే 20 కంటే తక్కువ బంతుల్లో ఫిఫ్టీ(3)లు సాధించిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు.





























