క్రిస్ గేల్.. సిక్సర్లు, ఫోర్ల ద్వారా అత్యధిక పరుగులు చేసిన రికార్డు క్రిస్ గేల్ పేరు మీద ఉంది. IPL 2013లో ఆడిన 175 పరుగుల ఇన్నింగ్స్‌లో సిక్సర్లు, ఫోర్ల ద్వారా 156 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో మొత్తం 13 ఫోర్లు, 17 సిక్సర్లు బాదాడు. క్రిస్ గేల్ అంతకు ముందు IPL 2012లో తన 128 పరుగుల ఇన్నింగ్స్‌లో బౌండరీల ద్వారా 106 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. అలాగే ఐపీఎల్ 2015 లో 115 పరుగులు చేసిన తన ఇన్నింగ్స్‌లో కూడా బౌండరీల ద్వారా 100 పరుగులు చేశాడు. అతను 7 ఫోర్లు, 12 సిక్సర్లు కొట్టాడు. బ్రెండన్ మెక్కల్లమ్.. ఈ జాబితాలో బ్రెండన్ మెకల్లమ్ రెండవ స్థానంలో ఉన్నాడు. అతను 2008 ఐపీఎల్‌లో తన 158 పరుగుల ఇన్నింగ్స్‌లో బౌండరీలు అంటే సిక్సర్లు, ఫోర్ల ద్వారా 118 పరుగులు చేశాడు. KKR తరపున ఆడుతున్న మెకల్లమ్ RCBతో జరిగిన ఆ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 13 సిక్సర్లు కొట్టాడు.