AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs RCB Match Result: సాల్ట్, కోహ్లీల ఖతర్నాక్ ఇన్నింగ్స్.. 4వ విజయంతో టేబుల్ మార్చేసిన బెంగళూరు

Rajasthan Royals vs Royal Challengers Bengaluru, 28th Match: ఐపీఎల్ 28వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. బెంగళూరు 18వ ఓవర్లో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

RR vs RCB Match Result: సాల్ట్, కోహ్లీల ఖతర్నాక్ ఇన్నింగ్స్.. 4వ విజయంతో టేబుల్ మార్చేసిన బెంగళూరు
Rajasthan Royals Vs Royal Challengers Bengaluru, 28th Match
Follow us
Venkata Chari

|

Updated on: Apr 13, 2025 | 6:59 PM

Rajasthan Royals vs Royal Challengers Bengaluru, 28th Match: ఐపీఎల్ 28వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. బెంగళూరు 18వ ఓవర్లో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన విరాట్ కోహ్లీ తన టీ20 కెరీర్‌లో 100వ అర్ధశతకం సాధించాడు. అతను 62 పరుగులు చేశాడు. ఫిల్ సాల్ట్ 33 బంతుల్లో 65 పరుగులు చేశాడు. దేవదత్ పాడికల్ 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రాజస్థాన్‌కు చెందిన యశస్వి జైస్వాల్ 75 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

బెంగళూరుకు నాల్గవ విజయం..

18వ ఐపీఎల్ సీజన్‌లో, ఆర్‌సీబీ 6 మ్యాచ్‌ల్లో నాల్గవ విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు జట్టు సాధించిన నాలుగు విజయాలు కూడా సొంత మైదానానికి దూరంగా రావడం గమనార్హం. రెండు పరాజయాలు సొంత మైదానంలో ఎదురయ్యాయి. మరోవైపు, రాజస్థాన్ 6 మ్యాచ్‌ల్లో నాలుగో ఓటమిని చవిచూసింది. ఆ జట్టు కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహిష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.

ఇంపాక్ట్ ప్లేయర్స్: శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్, ఫజల్హాక్ ఫరూకీ, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), క్రునాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ.

ఇంపాక్ట్ ప్లేయర్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలాం, మనోజ్ భండాగే, జాకబ్ బెతేల్, స్వప్నిల్ సింగ్.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..