DC vs MI Playing XI: టాస్ ఓడిన ముంబై.. ఢిల్లీ వరుస విజయాలకు బ్రేక్ పడేనా?
Delhi Capitals vs Mumbai Indians, 29th Match: ఐపీఎల్‌లో ఆదివారం రెండో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

Delhi Capitals vs Mumbai Indians, 29th Match: ఐపీఎల్‌లో ఆదివారం రెండో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. గాయం కారణంగా ఫాఫ్ డు ప్లెసిస్ ఆడటం లేదు. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్-11లో ఎటువంటి మార్పులు చేయలేదు.
ఇరుజట్ల ముఖాముఖి పోటీల్లో ముంబై పైచేయి సాధించింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు రెండు జట్ల మధ్య మొత్తం 35 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ఢిల్లీ 19 గెలిచింది. ముంబై 19 గెలిచింది. అదే సమయంలో, రెండు జట్లు అరుణ్ జైట్లీ స్టేడియంలో 12 సార్లు తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ 7 సార్లు, ముంబై 5 సార్లు గెలిచాయి.
జట్లు:
🚨 Toss 🚨@DelhiCapitals won the toss and elected to bowl against @mipaltan in Delhi.
Updates ▶ https://t.co/sp4ar866UD#TATAIPL | #DCvMI pic.twitter.com/i7RqDJaMSB
— IndianPremierLeague (@IPL) April 13, 2025
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:
ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: కార్బిన్ బాష్, రాబిన్ మింజ్, అశ్వని కుమార్, రాజ్ బావా, కర్ణ్ శర్మ.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: దర్శన్ నల్కండే, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, డోనోవన్ ఫెరీరా, దుష్మంత చమీరా.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..