PSL vs IPL: పాక్ పరువు పాయే.. ప్రేక్షకుల కంటే వాళ్లే ఎక్కువ.. పీసీబీకి తలనొప్పిలా పీఎస్‌ఎల్
PSL 2025: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీ20 లీగ్ పీఎస్‌ఎల్ 10వ సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. కానీ, కేవలం 2 రోజుల్లోనే అభిమానులకు విరక్తి కలిగినట్లు తెలుస్తోంది. లోకల్ ప్లేయర్స్‌తోపాటు అంతర్జాతీయ స్టార్లు బరిలోకి నిలిచినా, మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు ఎలాంటి ఉత్సాహాన్ని చూపించడం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. అది కూడా కరాచీ లాంటి పెద్ద నగరంలో కావడం గమనార్హం.

PSL vs IPL: పాకిస్తాన్ సూపర్ లీగ్ 10వ సీజన్ ప్రారంభమైంది. రెండు రోజుల్లో 3 మ్యాచ్‌లు జరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్ IPLతో పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించడం పీఎస్‌ఎల్ (PSL) చరిత్రలో ఇదే మొదటిసారి. మరోసారి రెండు లీగ్‌ల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం మ్యాచ్‌లు లేదా లేదా లీగ్‌లో వెచ్చస్తోన్న డబ్బుల గురించి మాత్రమే కాదు.. పీఎస్‌ఎల్ కూడా ఐపీఎల్‌తో పోటీ పడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తాజాగా కరాచీలో జరిగి ఓ మ్యాచ్‌లో వింత అనుభవం ఎదురైంది. దీంతో నెటిజన్లు అంతా ఏకిపారేస్తున్నారు.
పీఎస్‌ఎల్ 10వ సీజన్ ఏప్రిల్ 11 శుక్రవారం నుంచి రావల్పిండిలో ప్రారంభమైంది. శనివారం, లీగ్ మూడవ మ్యాచ్ కరాచీ కింగ్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగింది. రెండు జట్ల నుంచి పరుగుల వర్షం కురిసింది. 450 కంటే ఎక్కువ పరుగులు వచ్చాయి. కానీ, ఈ మ్యాచ్ చూడటానికి స్టేడియంలో కేవలం 5000 మంది అభిమానులు మాత్రమే ఉన్నారు. ఇది PSL ప్రజాదరణను ప్రభావితం చేసింది.
అభిమానుల కంటే భద్రతా సిబ్బందే ఎక్కువ..
Security personnel for PSL in Karachi 6700
Fans for PSL in Karachi 5000 pic.twitter.com/BSShWEvxHM
— ٰImran Siddique (@imransiddique89) April 12, 2025
మహ్మద్ రిజ్వాన్, డేవిడ్ వార్నర్, హసన్ అలీ, టిమ్ సీఫెర్ట్, జేమ్స్ విన్స్ వంటి అనేక మంది పాకిస్తానీ, అంతర్జాతీయ స్టార్లు ఉన్నప్పటికీ, చాలా తక్కువ మంది ప్రేక్షకులు మ్యాచ్ చూడటానికి వచ్చారు. అక్కడ మ్యాచ్ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ మ్యాచ్ కోసం స్టేడియం లోపల, చుట్టుపక్కల ప్రేక్షకుల కంటే ఎక్కువ మంది భద్రతా సిబ్బంది కనిపించడం గమనార్హం. ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ ఈ సత్యాన్ని ప్రపంచం ముందు ఉంచి, మ్యాచ్‌కు కేవలం 5 వేల మంది ప్రేక్షకులు మాత్రమే చేరుకున్నారని, ఈ మ్యాచ్ కోసం 6700 మంది భద్రతా సిబ్బందిని నియమించారని తెలిపాడు.
నిరంతరం ఇదే సమస్య..
పీఎస్ఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకుల కొరత ఏర్పడటం ఇదే మొదటిసారి కాదు. ముఖ్యంగా కరాచీలో, గత కొన్ని సీజన్లలో అభిమానుల కొరత గురించి నిరంతరం ఫిర్యాదులు వస్తున్నాయి. నిర్వాహకులు కూడా దీని గురించి నిరాశ చెందినట్లు కనిపిస్తోంది. కేవలం PSLలోనే కాదు, అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా, గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులు స్టేడియానికి చేరుకోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీజన్ ముందుకు సాగుతున్న కొద్దీ ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఇది ఈ టోర్నమెంట్, పాకిస్తాన్ క్రికెట్‌కు ఆందోళన కలిగించే విషయంగా మారుతుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..