లెమన్ టీ వీళ్లు అస్సలు తాగకూడదు..? లేదంటే మీ ఆరోగ్యం డేంజర్‌లో పడినట్టే..
టీ, చాయ్ చాలా మంది ప్రియులు ఉన్నారు. బ్లాక్ టీ, మసాలా టీ, హెర్బల్ టీ, గ్రీన్ టీ ఇలా చాలా రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎక్కువగా లెమన్ టీ తాగుతుంటారు. ఇందులో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. పాల టీ కంటే లెమన్ టీ చాలా మంచిది. కానీ, కొందరు మాత్రం లెమన్ టీకి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.
Updated on: Apr 13, 2025 | 9:49 AM

నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు పంటి నొప్పి సమస్య ఉంటే లెమన్ టీ తాగకూడదు. తాగితే పంటి ఎనామిల్ పాడవుతుంది. దంతాల నష్టానికి దారి తీస్తుంది. లెమన్ టీ తాగిన తర్వాత పళ్ళు తీవ్రమైన నొప్పి, సున్నితత్వం అనుభవించవచ్చు.

పుల్లటి ఆహారం పడనివాళ్లు లెమన్ టీ తాగకూడదు. తాగితే ఒంట్లో చాలా సమస్యలొస్తాయి. అసిడిటీ సమస్య ఉన్నవాళ్లు లెమన్ టీ తాగకూడదు. తాగితే కడుపులో అసిడిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఒంటి నొప్పులు, తలనొప్పి ఉన్నవాళ్లు లెమన్ టీ తాగకూడదు. అది తలనొప్పిని ఇంకా పెంచుతుంది.

నిమ్మకాయ మూత్రం ద్వారా కాల్షియంని బయటకి పంపిస్తుంది. దీన్ని టీలో కలుపుకుని దాగినప్పుడు శరీరం గ్రహించలేని అల్యూమినియంని టీ గ్రహించేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఇవి శరీరంలో యాసిడ్ స్థాయిలని పెంచుతాయి. ఇది నేరుగా ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. షుగర్, బీపీ లాంటి సమస్యలకు మందులు వేసుకుంటే లెమన్ టీ తాగొద్దు. తాగితే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి.

శరీరంలో ఆమ్ల స్థాయి పెరగడం వల్ల జీవక్రియ ప్రభావితం చేస్తుంది. శరీరంలోని నీటి స్థాయిలో అసమతుల్యత ఏర్పడుతుంది. వివిధ ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది. లెమన్ టీ తాగిన తర్వాత తలనొప్పి కూడా రావచ్చు.

నిమ్మకాయలోని ఆక్సలెట్లు మూత్రపిండాల్లో రాళ్లకు దోహద పడతాయి. ఇందులోని కెఫీన్ నిద్రలేమి, హృదయ స్పందన రేటు అధికంగా మారడానికి తీస్తుంది.టీలో నిమ్మరసం కలవడం వల్ల దాని యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీర జీర్ణక్రియ ప్రక్రియని నెమ్మదించేలా చేస్తుంది. గుండెల్లో మంట, యాసిడ్ రీఫ్లక్స్, ఉబ్బరం, మలబద్ధకం సమస్యని కలిగిస్తుంది.





























