Onions: వేసవిలో ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు.. ఏ విధంగానో తెల్సా?
ఉల్లిపాయలు తినని వారు దాదాపు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉల్లి లేకుండా వంట చేయడం కూడా దాదాపు అసాధ్యం. ఇవి ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా, ఇందులోని సహజ ఔషధ గుణాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది నిస్సందేహంగా పోషకాలకు పవర్‌హౌస్ వంటిది. అందుకే దీనిని పలు రకాల ఔషధాలలో..
Updated on: Apr 13, 2025 | 3:30 PM

ఉల్లిపాయలు తినని వారు దాదాపు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉల్లి లేకుండా వంట చేయడం కూడా దాదాపు అసాధ్యం. ఇవి ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా, ఇందులోని సహజ ఔషధ గుణాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది నిస్సందేహంగా పోషకాలకు పవర్‌హౌస్ వంటిది. అందుకే దీనిని పలు రకాల ఔషధాలలో ఉపయోగిస్తారు. ఉల్లిపాయలు యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలను కలిగి ఉంటాయి.

ముఖ్యంగా వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించుకోవచ్చు. వీటిని ఉడికించకుండా పచ్చిగా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయల్లో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు బి, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఉల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచివని అంటారు.

అంతేకాకుండా ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అధిక వేడి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వేసవిలో వ్యాధుల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, అటువంటి సమస్యల నుండి దూరంగా ఉండటానికి శరీరానికి ఎక్కువ పోషకాహారం అవసరం. అలాంటి సందర్భాలలో, ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా, ఉల్లిపాయలు తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. అలాగే చెమటను కూడా తగ్గిస్తుంది.

వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల హీట్ స్ట్రోక్‌ను నివారించవచ్చు. వడదెబ్బ ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పుడు మీ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడం ద్వారా పచ్చి ఉల్లి మిమ్మల్ని కాపాడుతుంది.

ఉల్లిపాయలు సహజంగా చల్లదనాన్ని కలిగి ఉంటాయి కాబట్టి, వేసవిలో వాటిని తినడం వల్ల సహజంగానే శరీరం చల్లబడుతుంది. ఉల్లిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. వేసవిలో కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఇది అటువంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల, అవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ విధంగా వేసవిలో వచ్చే వ్యాధులను నివారించడంలో ఉల్లి బలేగా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.





























