- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan Harihara Veeramallu to Suriya 45 movie latest film updates from industry
Tollywood Updates: హరిహర వీరమల్లు రిలేజ్ డేట్‌పై క్లారిటీ.. సూర్య 45లో మరో బ్యూటీ..
హరిహర వీరమల్లు రిలేజ్ డేట్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తాను అటెండ్ అయిన ప్రతీ ఈవెంట్‌లోనూ ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు హృతిక్ రోషన్. సూర్య 45 టీమ్‌తో మరో బ్యూటీ జాయిన్ అయ్యారు. టాయిలెట్ సినిమా టైటిల్ విషయంలో జయా బచ్చన్ చేసిన విమర్శలపై అక్షయ్‌కుమార్ స్పందించారు. సోషల్ మీడియా ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించారు సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్.
Updated on: Apr 13, 2025 | 9:37 AM

హరి హర వీరమల్లు రిలేజ్ డేట్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. డబ్బింగ్, రీ రికార్డింగ్, వీఎఫ్‌ఎక్స్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని, ముందు ప్రకటించినట్టుగా మే 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఎనౌన్స్ చేశారు. పవన్ కల్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకుడు.

తాను అటెండ్ అయిన ప్రతీ ఈవెంట్‌లోనూ ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు హృతిక్ రోషన్. ఆ మధ్య ముంబై ఈవెంట్‌లో తారక్ మీద ప్రశంసలు కురిపించిన హృతిక్, ఇప్పుడు అమెరికా ఈవెంట్‌లోనూ అలాంటి కామెంట్స్ చేశారు. జూనియర్‌ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నా అన్నారు. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వార్ 2, ఆగస్టు 14న రిలీజ్ కానుంది.

సూర్య 45 టీమ్‌తో మరో బ్యూటీ జాయిన్ అయ్యారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో మలయాళ బ్యూటీ అనఘా రవి కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని అనఘా తన సోషల్ మీడియా పేజ్‌లో స్వయంగా ప్రకటించారు.

టాయిలెట్ సినిమా టైటిల్ విషయంలో జయా బచ్చన్ చేసిన విమర్శలపై అక్షయ్‌కుమార్ స్పందించారు. 'ఆమె ఏమన్నారో నాకు తెలియదు. ఒకవేళ ఆమె టైటిల్ గురించే చెప్పి ఉంటే, దాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఆమె ఏం చెబితే అది కరెక్టే' అన్నారు. అక్షయ్ కుమార్, భూమి పడ్నేకర్ జంటగా తెరకెక్కిన టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ ఘన విజయం సాధించింది.

సోషల్ మీడియా ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించారు సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్. 'సోషల్ మీడియాలో కూర్చుని ఇతరుల గురించి అర్థం లేని విషయాలు పోస్ట్ చేయడంతో మీ రోజు గడిచిపోతుంది అనుకుంటున్నారా? మీకెలా నిద్రపడుతుంది?' అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.





























