Sreeleela: ఆ ఫీల్‌ని పోగొట్టడమే లక్ష్యం.. ఇంట్రస్టింగ్‌గా శ్రీలీల 2025 లైనప్..
లాస్ట్ ఇయర్ అంతా మిస్ అయ్యాం.. మిస్ అయ్యాం అని అన్నవాళ్లకి ఆ ఫీల్‌ని పోగొట్టడం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు శ్రీలీల. ఒకటికి నాలుగు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. మరి ఆ సినిమాలు ఏంటి.? వీటిపై ఎంత ఇంపాక్ట్ ఉంది.? ఈ ఇయర్ శ్రీలీల ప్లాన్ ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం రండి..
Updated on: Apr 13, 2025 | 10:12 AM

2024 ఇయర్ ఎండింగ్‌లో కిస్సిక్ సాంగ్ వచ్చేవరకు కాస్త స్థబ్దుగానే కనిపించింది శ్రీలీల కెరీర్. కానీ ఈ ఏడాది అలా లేదు. రీసెంట్ రాబిన్‌హుడ్ కాస్త డిసప్పాయింట్ చేసినా, నెక్స్ట్ లైనప్ మాత్రం చాలా ఇంట్రస్టింగ్‌గానే అనిపిస్తోంది.

తెలుగులో మాస్ జాతర ప్రమోషన్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మాస్ మహరాజ్‌తో, క్లాస్ లీల వేసే స్టెప్పుల కోసం జనాలు వెయిటింగ్. తాజాగా విడుదలైన తూ మేర లవర్ అనే సాంగ్ ప్రోమో చూస్తే శ్రీలీల పెర్ఫార్మన్స్ అదరగొట్టేసినట్టే కనిపిస్తుంది.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ చేస్తున్న లెనిన్‌లోనూ హీరోయిన్‌గా శ్రీలీల కనిపిస్తోంది. నో వార్ ఈజ్ మోర్ వయొలెంట్ దేన్ లవ్ అంటూ రీసెంట్‌గా విడుదలైన గ్లింప్స్ ని బట్టే, శ్రీలీలకు ఈ మూవీలో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అర్థమైపోతుంది.

తమిళంలో శివకార్తికేయన్ పరాశక్తి సినిమాలో కథానాయికగా నటిస్తుంది శ్రీలీల. ఈ సినిమా నుంచి వచ్చిన టైటిల్ టీజర్ ఆకట్టుకుంది. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ పీరియడ్ డ్రామా చిత్రం ఇది.

హిందీలో కార్తిక్ ఆర్యన్ సరసన ఓ సినిమా చేస్తుంది. దీనికి అనురాగ్ బసు దర్శకుడు. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది ఈ క్యూట్ బ్యూటీ. సో, బ్యాక్ టు బ్యాక్ ఫోర్ వెరైటీ ప్రాజెక్టులతో సిద్ధమైపోతున్నారు మిస్ శ్రీలీల.





























