AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చియా సీడ్స్​ని నానపెట్టకుండానే తింటే ఎంత డేంజరో తెలుసా..? తస్మాత్‌ జాగ్రత్త..

Chia Seeds Water: చాలా మంది బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్‌లో కచ్చితంగా చియా సీడ్స్‌ తీసుకుంటారు. ఈ విత్తనాలు బరువు తగ్గాడానికే కాదు.. మన ఆరోగ్యాన్ని రక్షంచడానికి సహాయపడతాయి. చియా సీడ్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాలలో ఫైబర్, ప్రొటీన్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్‌ వంటి పోషకాలు మెండుగా ఉంచాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్‌ను సలాడ్స్‌, స్మూతీలో వేసుకుని చాలా మంది తింటూ ఉంటారు. కానీ వాటిని సరిగ్గా తినకపోతే ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రై చియా సీడ్స్​ తిని, ఆ తర్వాత నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda

|

Updated on: Apr 13, 2025 | 12:11 PM

చియా సీడ్స్​ పరిమాణం పెరిగి గొంతు- కడుపు మధ్య ఆగిపోతాయట. అయితే, ఇది చాలా అరుదుగా జరగవచ్చు. ఒకవేళ జరిగితే మాత్రం వాటిని తొలగించేందుకు ఎండోస్కోపిక్​ సర్జరీ చేయాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5
చియా సీడ్స్​వాటి బరువు కన్నా 27రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకోగలవు. అందుకే ఎలాంటి సమస్యలు రాకూడదంటే చియా సీడ్స్​ని రాత్రంతా నానపెట్టిన తర్వాత తినాలి.
అది కుదరకపోతే కనీసం 30 నిమిషాలు నానపెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

చియా సీడ్స్​వాటి బరువు కన్నా 27రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకోగలవు. అందుకే ఎలాంటి సమస్యలు రాకూడదంటే చియా సీడ్స్​ని రాత్రంతా నానపెట్టిన తర్వాత తినాలి. అది కుదరకపోతే కనీసం 30 నిమిషాలు నానపెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
చియా సీడ్స్ లలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణ క్రియకు సహాయపడినా.. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే పొట్ట ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. చియా సీడ్స్ లను తీసుకోవాలంటే నీటిని కూడా తగినంతగా తాగడం అవసరం.

3 / 5
చియా సీడ్స్ నీటిలో నానబెట్టకుండా నేరుగా తింటారు కొంతమంది. కానీ, ఇది సరైనది కాదని చెబుతున్నారు.. వీటిని సలాడ్‌లపై చల్లడం లేదా వేయించి తినడం వల్ల ఆహార నాళంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం లేదా అన్నవాహిక సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి చియా సీడ్స్ లను సరైన పద్ధతిలో తీసుకోవడం చాలా అవసరం.

4 / 5
చియా సీడ్స్ లను నీటిలో కనీసం 20 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి. రోజు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే తినడం సరిపోతుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుల సలహాతో వీటిని తీసుకోవడం మంచిది. చియా సీడ్స్ శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి. కానీ ఇవి లిమిటెడ్ గా తీసుకోకపోతే శరీరానికి హాని చేస్తాయి. అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుల సూచనలతో వీటిని తీసుకోవడం మంచిది.

5 / 5
Follow us