థైరాయిడ్ తో సతమతం అవుతున్నారా.. దానికి చెక్ పెట్టాలంటే ఈ ఫుడ్ తినాల్సిందే!

samatha 

12 april 2025

Credit: Instagram

ప్రస్తుతం చాలా మంది మహిళలను పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉన్నదంటే అది థైరాయిడ్. చాలా మంది మహిళలు దీని బారిన పడుతున్నారు.

దీంతో అసలు థైరాయిడ్ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతన్నారు. కాగా వారి కోసమే ఈ అదిరిపోయే సమాచారం. ఈ ఫుడ్ తింటే థైరాయిడ్ కు చెక్ పెట్టొచ్చునంట.

సాల్మన్  , ఫ్యాటీ ఫిష్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇన్ ఫ్లేమేషన్ తగ్గి  థైరాయిడ్ పనితీరు బాగుంటుంది.

పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. దీని వలన పెరుగు ప్రతి రోజూ తింటే గట్ హెల్త్ బాగుండి, థైరాయిడ్ మెరుగు అవుతుంది.

ప్రతి రోజూ ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ గుడ్డు తినడం వలన సెలీనియ్ , అయోడిన్ శరీరానికి  అంది, థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.

పాల ఉత్పత్తులు తినడం కూడా థైరాయిడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో అయోడిన్ ఎక్కువ మొతాదులో ఉండటం వలన ఇది థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది.

బ్లూ బెర్రీస్, రాస్ బెర్రీస్, స్ట్రా బెర్రీస్ లలో యాంటీ ౠక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా విటమిన్స్, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉండటం వలన ఇవి థైరాయిడ్ పని తీరును మెరుగు పరుస్తాయి.

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో విటమిన్స్, ఖినిజాలు, పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ కె ఎక్కువగా ఉండటం వలన థైరాయిడ్ పనితీరు బాగుంటుందంట.