Neem Leaves: వేపాకులే అమృతం.. ఉదయాన్నే మూడు ఆకులు తింటే ఆ మహమ్మారికి చెక్ పెట్టొచ్చు..
ప్రస్తుత కాలంలో మధుమేహం వ్యాధి ఒక సాధారణ సమస్యగా మారింది. ఈ వ్యాధి చాలా మందిని ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ వ్యాధిని నియంత్రించడం చాలా కష్టం.

ప్రస్తుత కాలంలో మధుమేహం వ్యాధి ఒక సాధారణ సమస్యగా మారింది. ఈ వ్యాధి చాలా మందిని ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ వ్యాధిని నియంత్రించడం చాలా కష్టం. అయితే వేప ఆకులను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వేప ఆకుల వినియోగం అనేక వ్యాధులను నయం చేస్తుంది. వేప ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండాలంటే వేప ఆకులను తినవచ్చు. డయాబెటిక్ పేషెంట్లు వేపాకులను ఎలా తినాలి.. ఎంత తినాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..
డయాబెటిక్ రోగులు ఈ విధంగా వేపాకులను తినాలి..
ఖాళీ కడుపుతో తీసుకోవాలి: మధుమేహ వ్యాధిగ్రస్తులకు వేప ఆకులను ఉదయం వేళ తీసుకోవాలి. ముందుగా 6 ఆకులను తీసుకొని వాటిని కడగాలి. అనంతరం ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమలి తినండి. ఇలా చేయడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి మధుమేహం అదుపులో ఉంటుంది. ముందుగా వేప ఆకులను తినడం ప్రారంభించాలనుకుంటే కేవలం 3 ఆకులను మాత్రమే తినాలి..
నీటిలో మరిగించి తాగాలి: చక్కెర స్థాయిని నియంత్రించడానికి వేపాకులను మరిగించి తాగవచ్చు. ముందుగా ఒక గ్లాసు నీటిలో వేప ఆకులను మరిగించాలి. నీరు సగం కాగానే వడగట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయని పేర్కొంటున్నారు.




ఆకుల రసాన్ని తీసి తాగండి: మధుమేహం నియంత్రణలో ఉండాలంటే.. 6 వేప ఆకులను చూర్ణం చేసి ఈ ఆకుల రసాన్ని తీసుకోవాలి. ఈ జ్యూస్ తాగడం వల్ల షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది. అనేక వ్యాధులు నయమవుతాయి. అందుకే వేప ఆకులను తీసుకోవాలని సూచిస్తున్నారు.
నోట్.. వేపాకులను ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించి తీసుకోవడం మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..




