Diabetes: మధుమేహం ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే.. మీలో ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి..

మధుమేహం గురించి వివరంగా చెప్పుకోవాలంటే.. ఇది దీర్ఘకాలికమైన ఇంకా పరిష్కారం లేని ఆరోగ్య సమస్య.  ఈ సమస్య ఉన్నవారికి ప్రతిదీ నియమమే. తాగే డ్రింక్స్ నుంచి తినే ఆహారం వరకు ఆహారపు నియమాలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే రక్తంలోని షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. ఇలా షుగర్ లెవెల్స్ పెరిగితే..

Diabetes: మధుమేహం ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే.. మీలో ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి..
Diabetes symptoms
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 12, 2023 | 6:15 AM

ప్రస్తుత కాలంలో మధుమేహం లేదా డయాబెటీస్ అనేది సర్వసాధారణ అరోగ్య సమస్యగా మారింది.  మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగానే అనేక మంది మధుమేహం బారిన పడుతున్నారు. ఇంకా శారీరక శ్రమ లేనందున కూడా మధుమేహం ఎదురవుతుంది. ఇక మధుమేహం గురించి వివరంగా చెప్పుకోవాలంటే.. ఇది దీర్ఘకాలికమైన ఇంకా పరిష్కారం లేని ఆరోగ్య సమస్య.  ఈ సమస్య ఉన్నవారికి ప్రతిదీ నియమమే. తాగే డ్రింక్స్ నుంచి తినే ఆహారం వరకు ఆహారపు నియమాలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే రక్తంలోని షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. ఇలా షుగర్ లెవెల్స్ పెరిగితే ప్రాణాంతకం కాగలదు. ఇక ఈ మధుమేహ సమస్య బారిన పడ్డారో లేదో చాలా మందికి అర్థం కాదు. ఇలా తమలో ఉన్న మధుమేహాన్ని గుర్తించలేకనే ఎందరో దీన్ని తీవ్రతరం చేసుకుంటున్నారు. అయితే మధుమేహం ఉన్నదో లేదో ఎలా గుర్తించాలి..? మధుమేహం ఉండే శరీరంలో కనిపించే లక్షణాలేమిటి..? మధుమేహ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి..? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహం ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే

పాదాల నొప్పి: మీ పాదాలపై గాయాలతో పాటు నొప్పి కనిపించినట్లయితే.. మీకు మధుమేహం ఉందని అనుమానించాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, బ్యాక్టీరియా శరీరంలో వ్యాపించడం ప్రారంభిస్తుంది. ఫలితంగా మధుమేహం ఉన్నవారికి ఇన్ఫెక్షన్లు, పాదాల చుట్టూ గాయాలు వస్తాయి.

ఫంగల్ ఇన్ఫెక్షన్: ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మధుమేహం ఉన్నవారు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువ. ఫంగల్ ఇన్ఫెక్షన్ గోళ్లను ప్రభావితం చేస్తుంది. గోళ్లలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పాదాలలో వాపు: మధుమేహంతో బాధపడేవారి పాదాలలో వాపు, లావు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటి వల్ల వ్యాధిగ్రస్థులు నిటారుగా నిలబడటంతో పాటు కూర్చునేందుకు కూడా ఇబ్బంది పడుతుంటారు. మీ పాదాలలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

పాదాలలో తిమ్మిరి: మధుమేహం ప్రారంభ లక్షణం పాదాలలో తిమ్మిరి. వాస్తవానికి ఈ సమస్య ఉంటే.. శరీరంలోని బ్లడ్ షుగర్ పెరిగినట్లేనని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోతుంటే మీ పాదాలు మొద్దుబారినట్లు అనిపిస్తుంటాయి. కాబట్టి ఈ లక్షణం కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

మధుమేహ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి..?

మీలో మధుమేహ లక్షణాలు కనిపిస్తే.. వెనువెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేకపోతే మీ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..