Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ 4 పండ్లు తినకూడదు.. లేకుంటే ప్రమాదమే!

ఈ రోజుల్లో మధుమేహం వ్యాధి చాపకింద నీరులా పెరిగిపోతోంది. రోజురోజుకు మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే డయాబెటిస్‌ ఉన్నవారు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల సలహాలు, సూచనల చాలా ముఖ్యం. ఏవి పడితే అవి తినకూడదు. పండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి..

Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ 4 పండ్లు తినకూడదు.. లేకుంటే ప్రమాదమే!
Follow us

|

Updated on: Oct 26, 2024 | 9:04 PM

మధుమేహాన్ని షుగర్ వ్యాధి అని కూడా అంటారు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్య. దీనిలో శరీరం రక్తంలో చక్కెరను అంటే గ్లూకోజ్‌ను నియంత్రించలేకపోతుంది. మధుమేహం రెండు రకాలు. టైప్ 1, టైప్ 2. మధుమేహం సాధారణ లక్షణాలు తరచుగా దాహం, తరచుగా మూత్రవిసర్జన, అలసట, దృష్టి లోపం వంటి లక్షణాలు ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారపు అలవాట్లపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ చెప్పారు. ఈ వ్యాధిని మాత్రమే నియంత్రించవచ్చు. కొన్ని పండ్లు రక్తంలో చక్కెరను కూడా ప్రేరేపించగలవని నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో, మధుమేహ రోగులు ఈ పండ్లను తినకూడదు. ఏయే పండ్లను తింటే మధుమేహం సమస్య పెరుగుతుందో తెలుసుకుందాం.

  1. అరటిపండు: అరటిపండులో కార్బోహైడ్రేట్లు, చక్కెరలు అధికంగా ఉంటాయి. దీని కారణంగా రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ రోగులు అరటిపండ్లను తినకూడదు.
  2. ద్రాక్ష: ద్రాక్షలో సహజ చక్కెర కూడా చాలా ఉంటుంది. దాని గ్లైసెమిక్ సూచిక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర సమతుల్యతను దెబ్బ తీస్తుంది. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ రోగులు ఈ పండు నుంచి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
  3. సీతాఫలం: ఇందులో చక్కెర కూడా అధికంగా ఉంటుంది.ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఇది తక్కువ పరిమాణంలో తినాలి. షుగర్ రోగులు ఈ పండుకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు.ఇది శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని పాడు చేస్తుంది.
  4. డ్రైఫ్రూట్స్‌: ఎండుద్రాక్ష, ఖర్జూరం, అత్తి పండ్ల వంటి డ్రై ఫ్రూట్స్‌లో చాలా ఎక్కువ మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినకుండా ఉండాలి. వీటికి బదులు మఖానాను ఆహారంలో చేర్చుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

ఏదైనా పండు తినడం ప్రారంభించే ముందు డాక్టర్ లేదా డైటీషియన్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. సమతుల్య ఆహారం, వ్యాయామం, సరైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మధుమేహాన్ని బాగా నియంత్రించవచ్చు.

(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)