AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cockfight Betting: కాయ్ రాజా కాయ్.. సంక్రాంతి పందెం ఎంతోయ్!

కోడిపందేలు సంప్రదాయంలో భాగమే కావొచ్చు. అదే సంప్రదాయంలో మరో యాంగిల్ కూడా ఉంది. పౌరుషాలకు, పంతాలకు ప్రతీకగా ఈ కోడిపందేలను నిర్వహించేవారు. ఒకనాడు.. కోడిపందేలు ఇలాగే జరిగేవి. బట్ ఇప్పుడు రోజులు మారాయ్. అవే కోడిపందేలు ఇవాళ కోట్లు కుమ్మరించే ఓ వ్యాపారం. కోట్లంటే పదులు, వందలు కాదు.. ఏకంగా వేల కోట్ల రూపాయలు చేతులు మారేంతగా ఎదిగిన వ్యాపారం అది. పందెం కోళ్లకు, వాటి కాళ్లకు కట్టే కత్తికీ పరిశ్రమలు పుట్టుకొచ్చాయంటే.. 'జస్ట్ కోడిపందేలే కదా' అనే మైండ్ సెట్ నుంచి బయటపడాలి. మున్ముందు అసలు ఆ పేరే మారినా ఆశ్చర్యం లేదేమో. కోడిపందేలు, గుండాట, కోతాట, మద్యం అమ్మకాలు, మాంసం వంటకాల్లో వెరైటీలు, బరుల దగ్గర ఉండే జాతర తరహా ఎన్విరాన్‌మెంట్.. ఇవన్నీ కలగలిపి ఒక క్యాసినో స్టైల్‌కి మారేలా కనిపిస్తున్నాయ్. ఆల్రడీ ఈ సంక్రాంతి పండక్కి గోదావరి జిల్లాల్లో శ్రీలంక నుంచి క్యాసినో ఎక్స్‌పర్ట్స్ దిగిపోయారట. ముక్కనుమ తరువాత.. ఆ క్యాసినో కాన్సెప్ట్ ఎంత వరకు సక్సెస్ అయిందో తెలుస్తుంది. అందాకా.. అసలు ఈ సంక్రాంతి ఆరంభం ఎలా జరిగింది? మూడు రోజుల కోడిపందేల తీరు ఎలా ఉండబోతోంది? ఈసారి కోడిపందేల బరుల దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారతాయి?

Cockfight Betting: కాయ్ రాజా కాయ్.. సంక్రాంతి పందెం ఎంతోయ్!
Cockfight Betting
Ram Naramaneni
|

Updated on: Jan 14, 2026 | 10:13 PM

Share

‘ఆంధ్రా లాస్ వెగాస్’.. నిన్న మొన్నటిదాకా భీమవరానికి మాత్రమే ఈ బ్రాండ్ నేమ్ ఉండేది. ఇప్పుడు బరి ఉన్న ప్రతి ఏరియా ఓ లాస్ వెగాసే. కోడిపందేలు ఆడడానికి, వాటిని చూడడానికి, పనిలో పనిగా గుండాట, కోతాట ఆడడానికి వచ్చేవాళ్లతో ఆ లాస్ వెగాస్‌నే మించి పోతున్నాయి కొన్ని జిల్లాలు. ఇప్పటిదాకా చూసిన కోడిపందేల బరులు వేరు.. ఈసారి, ఇకమీదట చూడబోయేవి అనేలా ఉంటున్నాయి. గతాన్ని మించి ఏర్పాట్లున్నాయి. స్టార్ హోటల్ రేంజ్ ఫెసిలిటీస్ కాస్తా.. ఫైవ్ స్టార్ రేంజ్‌కి చేరాయి. అసలు ఏపీలో కోడిపందేలంటే ఒక లెవెల్.. అంతే. కోడిపందేలు అంటే గోదావరి జిల్లాలే గుర్తుకొస్తాయి. అక్కడ ఏ రేంజ్‌లో కోడిపందేలు జరుగుతాయి, ఎన్ని వందల కోట్లు చేతులు మారతాయో చెప్పడం కష్టం. కాకపోతే, గతేడాది లెక్కలతో కొంత అంచనా వేయొచ్చు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 400 కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది ఓ అంచనా. కృష్ణా జిల్లాలోనే 400 కోట్లు చేతులు మారితే.. ఇక ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఇంకెంత జరిగి ఉండొచ్చు..! ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే లాస్ట్ సీజన్‌లో ఏడెనిమిది వందల కోట్లు చేతులు మారినట్టు ఓ రఫ్ ఎస్టిమేషన్. ఆమాటకొస్తే.. భీమవరంలోనే 150 కోట్ల రూపాయల బెట్టింగ్‌ నడిచిందని టాక్. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూడా ఉందిగా. ఈ మొత్తం చూసుకుంటే.. ఓవరాల్‌గా రాష్ట్రం మొత్తం కలిపి ఎంత లేదన్నా 2వేల కోట్ల రూపాయలు గతేడాదే...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి