Diabetes Diet: డయాబెటిస్‌ రోగులు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో వీటిని అస్సలు తీసుకోకూడదు..!

మధుమేహం ఉంటే ఆహార నియమాలు తప్పక పాటించాలి. లేదంటే లేనిపోని చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల పొరపాటు అస్సలు చేయకూడదు. చాలా మంది ఉదయం పూట సరిగ్గా తినరు. తప్పు ఆహారం తినండం లేదంటే వేళకాని వేళలో తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో చాలా సేపు ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు..

Diabetes Diet: డయాబెటిస్‌ రోగులు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో వీటిని అస్సలు తీసుకోకూడదు..!
Diabetes Diet
Follow us

|

Updated on: Aug 06, 2024 | 1:33 PM

మధుమేహం ఉంటే ఆహార నియమాలు తప్పక పాటించాలి. లేదంటే లేనిపోని చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల పొరపాటు అస్సలు చేయకూడదు. చాలా మంది ఉదయం పూట సరిగ్గా తినరు. తప్పు ఆహారం తినండం లేదంటే వేళకాని వేళలో తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో చాలా సేపు ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ కింది ఆహారాలను బ్రేక్‌ఫాస్ట్‌లో అస్సలు తీసుకోకూడదు. ఒక వేళ వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి షుగర్ పేషెంట్లు ఉదయం అల్పాహారం తినేటప్పుడు ఎలాంటి పొరపాట్లకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం..

మధుమేహ వ్యాధిగ్రస్తులు స్నాక్స్‌లో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఉంచుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలోని అదనపు చక్కెరను గ్రహిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. మీరు ఓట్స్, క్వినోవా, పిండి రొట్టె, ఉడికించిన శనగలు వంటివి ఆహారంలో తీసుకోవాలి.

అల్పాహారంలో కేవలం తృణధాన్యాలు మాత్రమే తీసుకోకూడదు. పండ్లు, కూరగాయల ముక్కలను కూడా తీసుకోవాలి. చపాతీ లేదా బ్రెడ్ తినేటప్పుడు కూరగాయలతో చేసిన కూరలను ఉంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

అల్పాహారంలో పిండితో కూడిన ఆహారాన్ని తీసుకోకూడదు. లూచీ, పరాటా, కచూరి, బ్రెడ్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. బిస్కెట్లు, కేకులు కూడా తినకూడదు. అలాగే బంగాళదుంపలతో తయారు చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ కార్న్‌ఫ్లేక్స్, ఫ్రూట్ జ్యూస్ తీసుకోవద్దు. కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే షుగర్ ఫుడ్స్ పూర్తిగా మానుకోవాలి.

అల్పాహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్ పని చేయడానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. చాలా సేపు పొట్ట నిండుగా ఉంచుతుంది. అలాగే బరువును అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయనే భయం కూడా ఉండదు. ఉడికించిన శనగలు, గుడ్లు, పప్పులు వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తినవచ్చు.

అల్పాహారంలో పండ్ల రసాలను తీసుకోకూడదు. షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగవచ్చు. పండ్ల రసాన్ని తీసుకునే బదులు బొప్పాయి, యాపిల్ వంటి పండ్లను ఆహారంలో తీసుకోవాలి. తాజా పండ్లలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మీరు బాదం, వాల్‌నట్ వంటి గింజలను కూడా తినవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి