AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవర్‌ఫుల్.. ఈ ఒక్క ఆకుతో శరీరంలోని తిప్పలన్నీ దూరం.. ఉదయాన్నే ఇలా చేశారంటే..

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి.. ఇవి అనేక సమస్యలను తీర్చే సహజ ఔషధాలుగా పనిచేస్తాయి.. అలాంటి వాటిలో తిప్పతీగ ఒకటి.. తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు.

పవర్‌ఫుల్.. ఈ ఒక్క ఆకుతో శరీరంలోని తిప్పలన్నీ దూరం.. ఉదయాన్నే ఇలా చేశారంటే..
Benefits of Tippa Teega
Shaik Madar Saheb
|

Updated on: Aug 06, 2024 | 3:14 PM

Share

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి.. ఇవి అనేక సమస్యలను తీర్చే సహజ ఔషధాలుగా పనిచేస్తాయి.. అలాంటి వాటిలో తిప్పతీగ ఒకటి.. తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు. దీనిని ఎలా తీసుకున్నా శరీరానికి మంచిదే.. దీని ఆకుల నుంచి కాండం, వేర్లను కూడా తీసుంటారు.. అందుకే.. తిప్పతీగను తిరుగులేని ఔషధ మొక్కగా పేర్కొంటారు.. ఒక్క తిప్పతీగ.. ఒంట్లో ఉన్న తిప్పలన్నీ దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు..

అందుకోసమే తిప్పతీగ మూలికను అమృతం అంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు నయమవుతాయి. ఈ తీగ కాండం, ఆకు, వేరు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. తిప్పతీగను ప్రాచీన కాలం నుండి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. తిప్పతీగను తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

  1. తిప్ప తీగలో కనిపించే అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తరచుగా దగ్గు, జలుబు, టాన్సిలిటిస్ వంటి ఏవైనా సాధారణ శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. జలుబు, దగ్గు మాత్రమే కాకుండా, ఇది ఉబ్బసం రోగులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఛాతీ బిగుతుగా ఉండడం, శ్వాస ఆడకపోవడం, దగ్గు, గురక వంటి లక్షణాలను తిప్పతీగ తగ్గిస్తుంది.
  2. తిప్పతీగ రసం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. శరీరం మూలకాలను మెరుగుపరచడానికి, పోషించడానికి సహాయపడుతుంది. మధుమేహం, చర్మవ్యాధులు, కొన్ని కీళ్ల వ్యాధులు, నులిపురుగులు, జ్వరం, దగ్గు మొదలైన వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  3. తిప్పతీగ వేర్లు, త్రిఫల చూర్ణం కలిపి కషాయాలను తయారు చేసి, తేనెతో కలిపి, క్రమం తప్పకుండా తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. తిప్పతీగ ఆకులతోపాటు బెల్లం కలిపి సేవిస్తే మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.
  4. 10-20 మిల్లీలీటర్ల తిప్పతీగ రసాన్ని రోజుకు 3 సార్లు తాగితే చర్మవ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు దీనిని తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.. ఉబ్బసం దూరమవుతుంది..
  5. తిప్పతీగ జ్యూస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. తిప్పతీగ శరీరంలో రోగ నిరోధకశక్తిని మెరుగుపర్చి అనేక వ్యాధులను నియంత్రిస్తుంది.
  6. కీళ్ల వాపు, నొప్పి, మంట ఉంటే.. తిప్పతీగ వేర్ల కషాయాలను ప్రతిరోజూ తీసుకోవాలి. తిప్పతీగ కాండం ఇతర ఔషధ మొక్కలతో కలిపి కషాయంగా తాగవచ్చు. అయితే.. ఈ కషాయాన్ని ఉదయాన్నే తాగితే చాలా మంచిది..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..