AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dates: చలికాలం ఖర్జూర తింటే మంచిదేనా.. వాటిని ఎలా నిల్వ చేయాలంటే..

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటే ఖర్జూరాన్ని తినమని వైద్యులు సలహా ఇస్తారు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంతో పాటు, ఎనర్జీ లెవెల్‌ను పెంచేందుకు కూడా ఖర్జూర ఉపయోగపడుతుంది...

Dates: చలికాలం ఖర్జూర తింటే మంచిదేనా.. వాటిని ఎలా నిల్వ చేయాలంటే..
Dates
Srinivas Chekkilla
|

Updated on: Nov 23, 2021 | 1:56 PM

Share

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటే ఖర్జూరాన్ని తినమని వైద్యులు సలహా ఇస్తారు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంతో పాటు, ఎనర్జీ లెవెల్‌ను పెంచేందుకు కూడా ఖర్జూర ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి శరీరంలో రక్త కొరతను తొలగించడం వరకు, ఖర్జూరాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. చలికాలంలో ఖర్జూరం తినడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఖర్జూరాలను ఎల్లప్పుడూ శుభ్రమైన గాజు పాత్రలో నిల్వ చేయండి. జార్ ను ఎప్పుడూ ఖర్జూరంతో పూర్తిగా నింపకండి, ఇలా చేయడం వల్ల అవి త్వరగా పాడైపోతుంది.

ఖర్జూరాలను నిల్వ చేసేటప్పుడు, సూర్యకాంతి, వేడి గాలి, గ్యాస్, ఓవెన్ నుండి దూరంగా ఉంచాలని గుర్తుంచుకోండి. మీరు ఇలా చేస్తే చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి. జిప్ బ్యాగ్‌లో కూడా ఖర్జూరాలను నిల్వ చేయవచ్చు. మీరు ఖర్జూరను బాక్స్‌లో నింపి ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేయవచ్చు. అయితే, మెత్తని ఖర్జూరాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచవద్దు. రెండు వారాల్లో వాటిని తినడం మంచిది. ఖర్జూరాలను సుమారు 6 నెలల పాటు నిల్వ చేయడానికి వాటిని ఒక జార్‌లో నింపి, బ్లాటింగ్ పేపర్‌తో మూసి ఉంచండి. మీకు కావాలంటే మీరు ఖర్జూరాలను నిల్వ చేయడానికి గాలి చొరబడని ప్లాస్టిక్ కంటైనర్‌లను కూడా ఉపయోగించవచ్చు.

Read Also.. చలికాలంలో ఈ బ్రేక్‏పాస్ట్స్ తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అవేంటంటే..