Health Care: మీ శరీరానికి సరిపడా నీరు అందుతుందా.. ఇలా చెక్ చేసుకోండి!

తగినంత నీరు తాగడం వల్ల మీ దాహాన్ని తీర్చడం కంటే ఎక్కువే చేస్తుంది. మీ శరీరం ద్రవ సమతుల్యతను కాపాడుతుంది. కేలరీలను నియంత్రించడం, అవయవాలను సక్రమంగా పని చేయడం, శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడం, టాక్సిన్‌లను తొలగించడం ఇలా చాలానే చేస్తుంది నీరు. ప్రతి రోజూ కనీసం ఎనిమిది 250 ఎమ్‌ఎల్ నీటిని అయినా తాగాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి శరీరం భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీకు అవసరం అయిన హైడ్రేషన్ మీకు లభిస్తుందో..

Health Care: మీ శరీరానికి సరిపడా నీరు అందుతుందా.. ఇలా చెక్ చేసుకోండి!
Water
Follow us
Chinni Enni

|

Updated on: Jan 31, 2024 | 12:54 PM

తగినంత నీరు తాగడం వల్ల మీ దాహాన్ని తీర్చడం కంటే ఎక్కువే చేస్తుంది. మీ శరీరం ద్రవ సమతుల్యతను కాపాడుతుంది. కేలరీలను నియంత్రించడం, అవయవాలను సక్రమంగా పని చేయడం, శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడం, టాక్సిన్‌లను తొలగించడం ఇలా చాలానే చేస్తుంది నీరు. ప్రతి రోజూ కనీసం ఎనిమిది 250 ఎమ్‌ఎల్ నీటిని అయినా తాగాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి శరీరం భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీకు అవసరం అయిన హైడ్రేషన్ మీకు లభిస్తుందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? తగినంత నీరు శరీరానికి అందుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ టిప్స్ మీకు సహాయ పడతాయి. అవేంటో చూసేయండి.

మూత్రం రంగుపై శ్రద్ధ ఉంచండి:

మీ శరీరానికి తగినంత నీరు సరిపోయిందా లేదా అనేది మీ ముత్రం రంగు బట్టి తెలుసుకోవచ్చు. ముదరు పసుపు లేదా కాషాయం రంగులు నిర్జలీకరణాన్ని సూచిస్తాయి. అయితే లేత పసుపు లేదా గడ్డి రంగులు బాగా హైడ్రేట్ శరీరాన్ని సూచిస్తాయి. కాబట్టి మీరు సరైన హైడ్రేషన్ స్థాయిలను స్థిరంగా నిర్వహిస్తున్నారా లేదా అని నిర్ధారించుకోవడానికి రోజంతా మీ మాత్రంపై నిఘా ఉంచండి.

మూత్రం ఫ్రీక్వెన్సీ ముఖ్యం:

మీరు తరచుగా యూరిన్‌కి వెళ్తూ ఉంటే.. మీ శరీరం హైడ్రేట్‌గా ఉందని చెప్పొచ్చు. మీరు అరుదుగా మూత్రానికి వెళ్తూ ఉంటే.. తగినంత నీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

దాహం వేసేంత వరకూ ఎదురు చూడకూడదు:

చాలా మంది దాహం వేస్తేనే మంచి నీరు తాగుతారు. అలా కాకుండా.. గంటకు ఒక సారైనా నీటిని తాగుగూ ఉండటాన్ని అలవాటు చేసుకోండి. దీని వల్ల హైడ్రేట్‌గా ఉంటారు.

చర్మం నిర్జీవంగా ఉండటం:

మీ శరీరానికి తగినంత నీరు అందుతుందో లేదో చెప్పేందుకు చర్మం కూడా సహాయ పడుతుంది. మీ చర్మం కాంతి వంతంగా ఉంటే మీరు హైడ్రేట్‌గా ఉన్నారని చెప్పొచ్చు. మీ చర్మం నిర్జీవంగా, డల్‌గా ఉంటే తగినంత నీరు తాగడం లేదని అనుకోవచ్చు.

శరీర బరువును ట్రాక్ చేయండి:

ఆకస్మిక బరువు మార్పులు కూడా మీ హైడ్రేషన్ స్టాయిల్లో హెచ్చుతగ్గులను సూచిస్తాయి. ఆహారం తీసుకోవడం, వ్యాయామం వంటి కారణాల వల్ల బరువు కొద్దిగా మారడం సాధారణమైనప్పటికీ ఆహారం లేదా కార్యాచరణలో మార్పు లేకుండా స్థిరమైన బరువు తగ్గడం నిర్జలీకరణాన్ని సూచిస్తుంది. అదే విధంగా వేగవంతమైన బరువు పెరగడం కూడా ద్రవం నిలుపుదలని సూచిస్తుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.