Health: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలుసా.?
ఇందులోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, ఫైబర్, కార్బోహైడ్రేట్, పొటాషియం, జింక్, కాపర్, థయామిన్, రైబోఫ్లావిన్ వంటి అనేక పోషకాలు శరీరాన్ని వ్యాధుల నుంచి దూరం చేస్తుంది. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకుంటే మరిన్ని లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు...
వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఎన్నో ఔషధగుణాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. వెల్లుల్లిని ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఇందులోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, ఫైబర్, కార్బోహైడ్రేట్, పొటాషియం, జింక్, కాపర్, థయామిన్, రైబోఫ్లావిన్ వంటి అనేక పోషకాలు శరీరాన్ని వ్యాధుల నుంచి దూరం చేస్తుంది. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకుంటే మరిన్ని లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఉదయం పడగడుపున వెల్లుల్లి తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
* పొట్ట ఆరోగ్యాన్ని కాపాడడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రాశయం పనితీరు మెరుగవుతుంది. అతిసారం నుంచి ఉపశమనం లభిస్తుంది. మెరుగైన జీర్ణక్రియను అందించడంతో పాటు ఆకలిని పెంచుతుంది. వెల్లుల్లి ఒత్తిడిని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. కడుపులో యాసిడ్ స్థాయిలు పెరగకుండా చూసుకుంటుంది.
* ఇక రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తాయి. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల శరీరాన్ని అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. ఇది జలుబు, దగ్గు, జ్వరం లేదా ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది.
* అధిక బీపీకి చెక్ పెట్టడంలో వెల్లల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. వెల్లుల్లి సారం హై బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల బీపీ లక్షణాలు తగ్గుతాయి.
* షుగర్ పేషెంట్స్‌కు కూడా వెల్లుల్లి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. డయాబెటిక్ రోగులు పచ్చి వెల్లుల్లిని తీసుకుంటే, చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇందులోని అల్లిసిన్ సమ్మేళనం చక్కెరను నియంత్రిస్తుంది. ప్రతిరోజూ 3-4 వెల్లుల్లి రెబ్బలు నమిలి తింటే బరువు అదుపులో ఉంటుంది.
* వెల్లుల్లి శరీరాన్ని డిటాక్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయి. క్యాన్సర్, డయాబెటిస్, డిప్రెషన్ వంటి వాటిని దరిచేరనివ్వదు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..