AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Japanese Encephalitis: మరో ప్రాణాంతక వైరస్‌! మెదడుకి జ్వరం.. ఆ వెంటనే మరణం.. తస్మాత్‌ జాగ్రత్త

ప్రస్తుతం ఇంటా.. బయటా.. దోమలు తెగ తిరుగుతున్నాయి. వీటి వల్ల రకరకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. తాజాగా మరో కొత్త వ్యాధి జనాలను భయపెడుతుంది. ఈ వ్యాధి వస్తే తొలుత సాధారణ జ్వరం వస్తుంది. ఆ తర్వాత అది తీవ్రమై మెదడుకు సోకుతుంది. ఇలా జరిగిన గంటల వ్యవధిలోనే మరణం సంభవిస్తుంది...

Japanese Encephalitis: మరో ప్రాణాంతక వైరస్‌! మెదడుకి జ్వరం.. ఆ వెంటనే మరణం.. తస్మాత్‌ జాగ్రత్త
Japanese Encephalitis
Srilakshmi C
|

Updated on: Dec 01, 2024 | 1:39 PM

Share

ఇటీవల ఢిల్లీలో జపనీస్ ఎన్సెఫాలిటిస్ జ్వరం కేసు నమోదైంది. జపనీస్ ఎన్సెఫాలిటిస్ వైరస్ వల్ల ఇది వచ్చినట్లు తెలిసింది. ఈ వైరస్ సోకిన జంతువులు, పక్షుల నుంచి దోమలకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. అయితే మెదడువాపు వైరస్ కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా? అనే సందేహం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది. కోవిడ్, మంకీపాక్స్ లాగా ఇది కూడా ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాపిస్తుందా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

జపనీస్ ఎన్సెఫాలిటిస్ లేదా జెఇ వైరస్ వ్యాప్తి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను పోలి ఉంటుందని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జుగల్ కిషోర్ చెప్పారు. అంటే దోమ మనిషిని కుట్టినప్పుడు ఈ వైరస్ వ్యాపిస్తుంది. కానీ దోమ కాటు వల్ల డెంగ్యూ లేదా మలేరియా మాదిరి ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపించదు. అయితే జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాధి సోకిన వ్యక్తి మరొకరికి రక్తాన్ని ఇస్తే మాత్రం వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు చాలా తక్కువ.

ఎన్సెఫాలిటిస్ ప్రారంభ లక్షణాలు ఏమిటి?

ఎవరికైనా ఈ జ్వరం సోకినప్పుడు.. తేలికపాటి నుంచి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఈ వైరస్ కేసులు పిల్లలలో మాత్రమే సంభవిస్తాయి. మెదడువాపు వ్యాధి వస్తే.. మొదట్లో తేలికపాటి జ్వరం ఉంటుంది. తలనొప్పితో వాంతులు వస్తాయి. ఇది తీవ్రమైతే జ్వరం మెదడుకు వెళుతుంది. దీంతో మెదడు కణాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో రోగి పరిస్థితి మరింత దిగజారుతుంది. మరణానికి కూడా కారణం కావచ్చు. ఈ జ్వరం మెదడుకు చేరిన తర్వాతే మెదడువాపు వ్యాధి కారణంగా మరణాలు సంభవిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఎన్సెఫాలిటిస్‌కు చికిత్స ఉందా?

మెదడువాపు వ్యాధికి ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే.. దానికి ఇంతవరకూ ఎలాంటి చికిత్స లేదు. లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స జరుగుతుంది. అయితే మెదడువాపు వ్యాధిని నివారించడానికి టీకా ఉంది. ఈ వ్యాక్సిన్‌ను బిడ్డ పుట్టిన వెంటనే వేయించవచ్చు.

ఈ వ్యాధిని ఎలా నివారించాలి?

  • మెదడువాపు వ్యాధిని నివారించడానికి దోమల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం.
  • పూర్తి చేతులకు వస్త్రాలు ధరించాలి.
  • ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి.
  • ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.