Green Chili: పచ్చిమిర్చిని నమిలి తింటే ఇన్ని లాభాలా.. ఆ వ్యాధి ఉన్నవారికి సూపర్ న్యూస్
వంటలు కారంగా చేయడంతోనే పచ్చిమిర్చి పని అయిపోలేదు. బోలెడు ఇతర ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పచ్చిమిర్చిలో పోషకాలేం ఉంటాయి అనుకోకండి. మనం ఊహించని చాలా లాభాలున్నాయి. దాదాపు అన్ని వంటల్లో పచ్చిమిర్చిని విరవిగా వాడతాం. ఫ్రిజ్ లో ఏమున్నా లేకపోయినా కొన్న పచ్చిమిర్చి మాత్రం ఉండి తీరాల్సిందే. పచ్చిమిర్చిని ఆంగ్లంతో గ్రీన్ చిల్లీ అని ఎక్కువగా అంటాం. కానీ విదేశీయులు వీటిని చిల్లి పెప్పర్ అంటారు. ఇదే జాతికి చెందిని క్యాప్సికంను బెల్ పెప్పర్ అంటారు. సంవత్సరం మొత్తం కొదవ లేకుండా దొరికే పచ్చిమిర్చి లాభాలేంటో చూసేయండి.

పచ్చిమిర్చిని బాగా నమిలి తినడం వల్ల నోటిలో లాలాజలం ఎక్కువగా స్రవిస్తుందని, ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సాధారణ అలవాటు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని అంటారు. పచ్చిమిర్చిలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె చప్పుడును సమతులంగా ఉంచడానికి, రక్తప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి. రక్తపోటు నియంత్రణలో ఉండటంతో పాటు గుండె ఆరోగ్యానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెబుతారు.
అంతేకాకుండా, పచ్చిమిర్చిలోని విటమిన్ సి శరీరంలో ఐరన్‌ను ఎక్కువగా శోషించేలా చేస్తుంది. దీని వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు సమతులంగా ఉండి, రక్తహీనత సమస్యలు తగ్గుతాయని అంటారు. ఇది శరీర శక్తిని పెంచడంలో కూడా తోడ్పడుతుంది.
పచ్చిమిర్చిని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది షుగర్ వ్యాధితో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను సమర్థవంతంగా చేస్తుంది.
పచ్చిమిర్చిలో సిలికాన్ సమృద్ధిగా ఉండటం వల్ల తల భాగంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతారు. అదే విధంగా, విటమిన్ ఈ చర్మంలో నూనె స్రావాన్ని ప్రోత్సహిస్తుంది, చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.
పచ్చిమిర్చిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మ సంక్రమణలను నివారిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, సంక్రమణ రహితంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాదు, పచ్చిమిర్చి ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గించే గుణాలను కలిగి ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
*గమనిక:* ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడింది. దీని నిజాయితీపై టీవీ9 తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు. ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.