Skin Care with Amla: ఉసిరితో ఎన్ని ప్రయోజనాలో.. మెరిసే చర్మం కోసం దానిని ఈ 5 విధాలుగా ఉపయోగిస్తే చాలు..
మానవ ఆరోగ్యానికి మేలుచేసే అనేక లక్షణాలు ఉసిరికాయలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా ఉసిరిని చర్మం, జుట్టు, ఆరోగ్యానికి చాలా ఉపయోగకారిగా భావిస్తారు. ఉసిరిలో..

మానవ ఆరోగ్యానికి మేలుచేసే అనేక లక్షణాలు ఉసిరికాయలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా ఉసిరిని చర్మం, జుట్టు, ఆరోగ్యానికి చాలా ఉపయోగకారిగా భావిస్తారు.ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్-సీ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఉసిరి మన చర్మాన్ని యవ్వనంగా ఉంచడమే కాకుండా, శరీరానికి అంటి పెట్టుకుని ఉన్న దుమ్ముదూళీ కణాలను దూరం చేస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని రిఫ్రెష్ చేయడానికి కూడా ఉసిరి ఉపకరిస్తుంది.
ఉసిరిని వివిధ రకాలైన కాస్మటిక్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. అయితే కాస్మటిక్స్ నిత్యం ఉపయోగించడం మన చర్మానికి అంత మంచిది కాదు. వాటికి బదులుగా ఉసిరిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుంటే సరి. మరి అవేమిటో, ఎలా పాటించాలో తెలుసుకుందాం..
ఉసిరి, పెరుగు, తేనె..
మెరిసే చర్మం కోసం ఉసిరి, పెరుగు, తేనెతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. రెండు చెంచాల ఉసిరి పొడిని ఒక చెంచా పెరుగు, ఒక చెంచా తేనెతో కలపండి. దీన్ని బాగా కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు మీ ముఖంలో మెరుపు కనిపిస్తుంది.




ఉసిరి, చక్కెర, రోజ్ వాటర్..
ఉసిరిని చర్మంపై రుద్దుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నె తీసుకుని అందులో ఒక చెంచా ఉసిరి పొడి, అర చెంచా పంచదార, ఒక చెంచా రోజ్ వాటర్ కలపాలి. సున్నితంగా దానిని స్క్రబ్ చేసిన తర్వాత మీ ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది ఇంకా చనిపోయిన చర్మ కణాలను చర్మం నుంచి తొలగిపోతాయి. ఇంకా మొటిమల మచ్చలు తొలగించడమే కాక అవి రాకుండా చేయడంలో ఉపకరిస్తుంది.
ఉసిరి, కలబంద..
ఫేస్ మాయిశ్చరైజింగ్ మాస్క్‌ను తయారు చేయడానికి అలోవెరా జెల్‌కు ఉసిరి రసాన్ని జోడించండి. కావాలంటే ఉసిరి పొడిని కూడా దీనిలో ఉపయోగించవచ్చు. రెండింటినీ మిక్స్ చేసి ముఖానికి పట్టించండి. ఓ 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా రెండు రోజులు వరుసగా చేయడం వల్ల మీ ముఖం మెరుస్తుంది.
ఉసిరి, బొప్పాయి..
చర్మాన్ని శుభ్రపరచడానికి ఉసిరి, బొప్పాయి కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. 2 టీస్పూన్ల ఉసిరి రసం తీసుకుని అందులో 2 టీస్పూన్ల బొప్పాయి గుజ్జును కలపాలి. రెండింటినీ మిక్స్ చేసి ముఖానికి రాయాలి. ఆపై 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. మీరు వారానికి ఒకసారి ఇలా చేసుకోవచ్చు. తద్వారా నిత్యం మెరిసేలా మీ ముఖం కనిపిస్తుంది.
ఉసిరి రసం..
ఉసిరి రసంలో దూదిని ముంచి ముఖానికి టోనర్ లాగా అప్లై చేయాలి. అయితే, ఇలా చేయడాన్ని రోజువారీ చేయకండి. అందుకు బదులుగా వారానికి 2, 3 సార్లు మాత్రమే చేస్తే చాలు. ఫలితంగా ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..