Room Heater Precautions: రూమ్ హీటర్‌ను అతిగా వాడేస్తున్నారా.. అయితే చాలా డేంజర్!

ప్రస్తుతం శీతా కాలం నడుస్తుంది. ఈ కాలంలో ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పడి పోతూ ఉంటాయి. ఇంట్లోని వస్తువులు, గోడలు అన్నీ చల్లగా ఉంటాయి. అదే విధంగా శరీరంలో కూడా ఉష్ణోగ్రతలు పడి పోతాయి. కాళ్లూ, చేతులు చల్లగా అయిపోతాయి. ఈ కారణంగానే ఇంట్లో రూమ్ హీటర్స్‌ని ఉపయోగిస్తూ ఉంటున్నారు. రూమ్ హీటర్స్ వల్ల చలి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. రక్షణగా కూడా ఉంటుంది. అయితే ఈ రూమ్ హీటర్స్‌ని అతిగా ఉపయోగిస్తే మాత్రం సైడ్ బెనిఫిట్స్ తప్పవని..

Room Heater Precautions: రూమ్ హీటర్‌ను అతిగా వాడేస్తున్నారా.. అయితే చాలా డేంజర్!
Room Heaters
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 17, 2024 | 11:15 AM

ప్రస్తుతం శీతా కాలం నడుస్తుంది. ఈ కాలంలో ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పడి పోతూ ఉంటాయి. ఇంట్లోని వస్తువులు, గోడలు అన్నీ చల్లగా ఉంటాయి. అదే విధంగా శరీరంలో కూడా ఉష్ణోగ్రతలు పడి పోతాయి. కాళ్లూ, చేతులు చల్లగా అయిపోతాయి. ఈ కారణంగానే ఇంట్లో రూమ్ హీటర్స్‌ని ఉపయోగిస్తూ ఉంటున్నారు. రూమ్ హీటర్స్ వల్ల చలి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. రక్షణగా కూడా ఉంటుంది. అయితే ఈ రూమ్ హీటర్స్‌ని అతిగా ఉపయోగిస్తే మాత్రం సైడ్ బెనిఫిట్స్ తప్పవని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

రూమ్ హీటర్స్ కారణంగా అనేక సైడ్ ఎఫెక్ట్స్..

రూమ్ హీటర్స్ కారణంగా ఇంట్లో కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ పొగలు పెరుగుతాయి. దీని వల్ల తల నొప్పి, జలుబు, ఫ్లూ, కళ్లు, ముక్కు, గొంతులో చికాకుగా ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే హీటర్ల నుండి వచ్చే పొడి గాలిలో కలిసి పోతుంది. దీని వల్ల చర్మ, జుట్టు సమస్యలు కూడా తలెత్తవచ్చు. చర్మంపై దద్దర్లు, దురదలు, కళ్లు పొడి బారిపోవడం, ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అలాగే నిర్వహణ లేని హీటర్ల కారణంగా ఇంట్లో అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం కూడా ఉంది.

నాణ్యత కలిగిన హీటర్లు వాడటం బెటర్..

కాబట్టి మంచి నాణ్యత కలిగిన హీటర్లను వాడటమే మంచిది. అదే విధంగా కొన్ని రకాల హీటర్లు పెట్రోల్, గ్యాస్, కిరోసన్‌తో నడిచేవి ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయువులను రిలీజ్ చేస్తాయి. వీటిని పీల్చడం వల్ల శ్వాస కోశ సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఉబ్బసం, అలర్జీ వంటి సమస్యలు ఏర్పడతాయి.

ఇవి కూడా చదవండి

వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి..

అదే విధంగా కంటిలో దురద రావడం, కళ్లు ఎర్ర బడటం వంటివి జరుగుతాయి. అంతే కాకుండా రూమ్ హీటర్లు వాడటం వల్ల కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి తక్కువ విద్యుత్ వినియోగం ఉన్నవి ఎంచుకోవడం బెటర్. రూమ్ హీటర్లు వాడే వారు ఇంట్లో సరైన విధంగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ