Lemon Water: లెమన్ వాటర్‌ను అలా తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. బరువుతో పాటు ఆ సమస్యలకు చెక్..
మనలో చాలామంది ఉదయం పూట ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడానికి ఇష్టపడతారు. కానీ భోజనం చేసిన లెమన్ వాటర్ తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
నిమ్మరసం జీర్ణక్రియ సమస్యలను దూరం చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా అధికంగా ఉంటాయి. మనం సాధారణంగా ఆయిల్ ఫుడ్ తిన్నా లేదా విందు భోజనం చేసిన తర్వాత లెమన్ వాటర్ తాగుతాం. అయితే రోజూ భోజనం చేసిన తర్వాత నిమ్మరసం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మనలో చాలామంది ఉదయం పూట ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడానికి ఇష్టపడతారు. కానీ భోజనం చేసిన లెమన్ వాటర్ తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణక్రియ సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ ఎముకలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహకరిస్తుంది. మరి ఆహారం తిన్న తర్వాత నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
- భోజనం చేసిన తర్వాత వేడి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే జీర్ణక్రియకు సహాయపడుతుంది. అదే సమయంలో, ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
- వేడి నీరు- నిమ్మకాయ మిశ్రమం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇది జలుబు, ఫ్లూ నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.
- నిమ్మరసం ఉత్తమ డిటాక్స్ పానీయాలలో ఒకటి. ఇది మీ శరీరం నుండి టాక్సిన్స్ మరియు హానికరమైన కణాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అందుకే ప్రతి భోజనం తర్వాత నిమ్మరసం తాగాలి.
- నిమ్మరసం ఉత్తమ డిటాక్స్ పానీయాలలో ఒకటి. ఇది మీ శరీరం నుండి టాక్సిన్స్, హానికరమైన కణాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అందుకే భోజనం చేసిన తర్వాత ప్రతిసారీ నిమ్మరసం తాగితే మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- రోజూ భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
- నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు.. ఆరోగ్యానికి అన్ని విధాలా ప్రయోజనాలను చేకూర్చుతుంది. దీనిని క్రమంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఎలా తాగాలంటే?
భోజనం చేసిన తర్వాత కనీసం 45 నిమిషాల పాటు నిమ్మరసం తాగకూడదు. భోజనం చేసిన 1 గంట తర్వాత మాత్రమే ఏదైనా పానీయం తాగడ మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా భోజనం చేసిన తర్వాత నిమ్మరసం కలిపిన చల్లటి నీళ్లను కూడా ఎప్పుడూ తాగకూడదు. ఎప్పుడూ వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..