AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Sugar Control: బ్లడ్ షుగర్ బాధితులకు ఈ పండు దివ్యౌషధం.. ఎలా పని చేస్తుందో తెలిస్తే అస్సలు వదలరు

Cherries for Diabetes: హారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు, చక్కెర నియంత్రణలో ఉన్న వాటిని తీసుకోవడం చేస్తుంటారు. డయాబెటిక్ రోగులకు పండ్ల వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దాని రసం ఆరోగ్యానికి హానికరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు..

Blood Sugar Control: బ్లడ్ షుగర్ బాధితులకు ఈ పండు దివ్యౌషధం.. ఎలా పని చేస్తుందో తెలిస్తే అస్సలు వదలరు
Cherries For Diabetes
Sanjay Kasula
|

Updated on: Jun 14, 2022 | 1:44 PM

Share

మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు, చక్కెర నియంత్రణలో ఉన్న వాటిని తీసుకోవడం చేస్తుంటారు. డయాబెటిక్ రోగులకు పండ్ల వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దాని రసం ఆరోగ్యానికి హానికరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెరను నియంత్రించడానికి కొన్ని పండ్లను తీసుకోవచ్చు. ఎండాకాలంలో షుగర్ నియంత్రణకు చెర్రీస్ తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. ఎర్రటి చెర్రీలు ఎంత అందంగా కనిపిస్తాయో అంతే రుచిగా ఉంటాయి. చెర్రీ అనేది శృంగార పండ్లలో ఒకటిగా పరిగణించబడే పోషకాలతో కూడిన పండు. ఇందులో శరీరానికి మేలు చేసే థయామిన్, రిబోఫ్లావిన్, విటమిన్ బి, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ బి6, పాంటోథెనిక్ యాసిడ్, నియాసిన్, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న చెర్రీస్ బ్లడ్ షుగర్ నియంత్రణలో బాగా సహాయపడుతుంది. వేసవిలో చెర్రీస్ తినడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. చెర్రీస్ షుగర్‌ని ఎలా నియంత్రిస్తుంది.. శరీరానికి ఎలాంటి ప్రయోజనాలను పొందుతుందో తెలుసుకుందాం.

చెర్రీస్ మధుమేహాన్ని ఎలా నియంత్రిస్తాయి..

రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చెర్రీస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ చెర్రీస్ తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. మధుమేహ బాధితులు చెర్రీస్ తీసుకుంటే వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చెర్రీస్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవిలో తప్పనిసరిగా చెర్రీస్ తినాలి.

ఇవి కూడా చదవండి

USDA తాజా పరిశోధనల ప్రకారం, ఒక కప్పు చెర్రీస్‌లో 52 కేలరీలు, 12.5 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. అవి వ్యాదితో పోరాడడంలో ఉపయోగపడతాయి. న్యూట్రియంట్‌లో మార్చి 2018లో ప్రచురించబడిన ఒక సమీక్ష ప్రకారం.. చెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. చెర్రీస్ లక్షణాలు గుండె జబ్బులు, క్యాన్సర్, ఇతర వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయని తేలింది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

చెర్రీస్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే చెర్రీస్ తీసుకోవడం వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి.

మలబద్దకానికి చికిత్స చేస్తుంది:

చెర్రీ పండ్లు తినడం వల్ల మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే చెర్రీస్ సులభంగా జీర్ణమవుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

మీరు రాత్రి నిద్రపోకపోతే, చెర్రీస్ తినండి

రాత్రి నిద్రపోని వారు రాత్రి పడుకునే ముందు చెర్రీస్ తినండి. చెర్రీస్‌లో మెలటోనిన్ అధికంగా ఉంటుంది. ఇది నిద్రలేమి, నిద్ర సమస్యలను దూరం చేస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హల్త్ వార్తల కోసం