AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో సీనియర్ నటి కన్నుమూత

బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో సీనియర్ నటి, ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్‌ ఆశాలత వాగోంకర్ కన్నుమూశారు

సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో సీనియర్ నటి కన్నుమూత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 22, 2020 | 2:39 PM

Share

Ashalata Wabgaonkar death: బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో సీనియర్ నటి, ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్‌ ఆశాలత వాగోంకర్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఓ మరాఠీ సీరియల్ షూటింగ్‌ నిమిత్తం ఆమె సతారాకు వెల్లగా.. అక్కడే ఆశాలతకు కరోనా సోకింది. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

అయితే గోవాకు చెందిన ఆశాలత మొదట్లో కొంకణి, మరాఠీ భాషల్లో వందలాది నాటకాల్లో నటించారు. ఆ తరువాత సినీ రంగంలో ప్రవేశించి పలు మరాఠీ చిత్రాల్లో కనిపించారు. అంతేకాదు అంకుఖ్‌, అహిస్తా అహిస్తా వో సాత్ దిన్‌, నమక్‌ హలాల్‌ వంటి బాలీవుడ్ చిత్రాల్లో ఆమె పలు పాత్రల్లో నటించారు. ఇక ఆమె మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు.

Read More:

శ్రీకాళహస్తి ఆలయంలో కొత్త విగ్రహాల కలకలం.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రియురాలి గురకకు చెక్‌ పెట్టేందుకు ప్రియుడి వినూత్న ప్రయోగం