ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న అనుష్క “బేబీ బంప్” ఫోటో

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Sep 22, 2020 | 2:48 PM

సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేశారు అనుష్క. శుభ‌వార్త‌ని పంచుకున్న సంద‌ర్భంగా బేబీ బంప్ ఫొటోతో వెల్ల‌డించిన అనుష్క శ‌ర్మ తాజాగా చిరున‌వ్వులు చిందిస్తూ బ్లాక్ బికినీలో స్విమ్మింగ్ షూల్‌లో నిల‌బ‌డి చిరున‌వ్వులు చిందిస్తున్న ఫొటో...

ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న అనుష్క బేబీ బంప్ ఫోటో

బాలీవుడ్ బ్యూటిఫుల్ బేబ్‌ అనుష్క, ఇండియ‌న్ క్రికెట్ టీమ్ సార‌థి విరాట్ కోహ్లీ తాము పేరెంట్స్ కాబోతున్నామంటూ చెప్పిన గుడ్ న్యూస్ కోట్లాది అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. ఆ త‌రువాత వీరిపై సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అభినంద‌న‌ల వ‌ర్షం కురిపించారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిక‌ల్లా పండటి పాప‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి అనుష్క‌శ‌ర్మ మ‌ద‌ర్ హుడ్‌ని ఎంజాయ్ చేస్తూ నెటిజ‌న్స్‌తో ప్ర‌తీ మూవ్‌మెంట్‌ని షేర్ చేసుకుంటూ మాతృత్వ‌పు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు.

తాజాగా మ‌రో ఫొటోని సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేశారు అనుష్క. శుభ‌వార్త‌ని పంచుకున్న సంద‌ర్భంగా బేబీ బంప్ ఫొటోతో వెల్ల‌డించిన అనుష్క శ‌ర్మ తాజాగా చిరున‌వ్వులు చిందిస్తూ బ్లాక్ బికినీలో స్విమ్మింగ్ షూల్‌లో నిల‌బ‌డి చిరున‌వ్వులు చిందిస్తున్న ఫొటోని షేర్ చేశారు.

View this post on Instagram

“Acknowledging the good that you already have in your life is the foundation for all abundance” – Eckhart Tolle Gratitude to all those who showed me kindness and made me believe in goodness in this world , opening my heart enough to practice the same with the hope to pay it forward 💜 Because … ” After all , we are all just walking each other home ” – Ram Dass #worldgratitudeday 💫

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

జీవితంపై జ‌ర్మ‌న్ ర‌చ‌యిత ఎఖార్ట్ టోల్లె చెప్పిన సూక్తులతో పాటు అమెరిక‌న్ స్పిర్చువ‌ల్ టీచ‌ర్‌, సైకాల‌జిస్ట్ రామ్‌దాస్‌ మంచి త‌నం, విశ్వాసంపై చెప్పిన మాట‌ల్ని ఈ సంద‌ర్భంగా అనుష్క శర్మ కోట్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ ఫొటోపై సెలబ్రిటీల‌తో పాటు నెటిజ‌న్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

View this post on Instagram

And then, we were three! Arriving Jan 2021 ❤️🙏

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

అయితే ఇప్పుడు ఈ స్విమ్ సూట్ పై పెద్ద చర్చ కూడా జరుగుతోంది. ఈ స్విమ్ సూట్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా పెరుగింది. ఇలాంటి బ్లాక్ స్విమ్ సూట్ తమకు కూడా కావాలంటూ అమ్మ కావాలనుకుంటున్న వనితలు ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu