శ్రీకాళహస్తి ఆలయంలో కొత్త విగ్రహాల కలకలం.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శ్రీకాళహస్తి ఆలయంలో ఇటీవల కొత్త విగ్రహాలు కలకలం రేపిన విషయం తెలిసిందే.

శ్రీకాళహస్తి ఆలయంలో కొత్త విగ్రహాల కలకలం.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2020 | 1:55 PM

New Statues Srikalahasti: చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శ్రీకాళహస్తి ఆలయంలో ఇటీవల కొత్త విగ్రహాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ మీడియా ముందు హాజరుపరిచారు. ఈ ముగ్గురు నిందితులు పుత్తూరుకు చెందిన అన్నదమ్ములని ఎప్పీ రమేష్ రెడ్డి తెలిపారు. వ్యక్తిగత సమస్యలు, దోషాలు పోవడానికి విగ్రహాలకు పూజలు చేసి ఆ విగ్రహాలను శ్రీకాళహస్తి అలయం లోపల ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. తిరుపతిలో ఏడు వేలకు శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలకు కొనుగోలు చేసి పూజలు చేసి శ్రీకాళహస్తిలో ఉంచారు.

అన్నదమ్ములకు పెళ్లి అవ్వకపోవడం, అప్పుల పాలు అవ్వడం, ఇతర సమస్యలకు దోషం పోవాలంటే పూజలు చేయాలని ఓ స్వామీజీ ఇచ్చిన సలహాతోనే ఇలా చేసినట్లు ఎస్పీ వివరించారు. పూజలు చేసిన విగ్రహాలను శ్రీకాళహస్తి ఆలయంలో ఉంచితే దోషాలు పోయి, కలిసి వస్తుందని ఆ స్వామీజీ చెప్పినట్లు విచారణలో అన్నదమ్ములు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. వీరి చేత పూజలు చేయించి ఇంతటి వివాదానికి కారణమైన స్వామీజీ కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కాగా ఆలయంలో శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలను అనధికారికంగా ప్రతిష్టించారు. గర్భాలయానికి సమీపంలోనే ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ కళ్లు గప్పి సెప్టెంబర్ 8న ఈ విగ్రహాలను ఆలయంలో పెట్టి ఉండవచ్చని అధికారులు భావించారు.  ఇక కొత్త ప్రతిమలను గుర్తించిన వెంటనే అర్చకులతో చర్చించిన ఈవో చంద్రశేఖరరెడ్డి ఆలయంలో సంప్రోక్షణ చేయించారు.

Read More:

ప్రియురాలి గురకకు చెక్‌ పెట్టేందుకు ప్రియుడి వినూత్న ప్రయోగం

సోనూసూద్ ఎంతమందికి సాయం చేశారు.. రివీల్ చేసిన నటుడు