సోనూసూద్ ఎంతమందికి సాయం చేశారు.. రివీల్ చేసిన నటుడు

కరోనా లాక్‌డౌన్ వేళ వలస కార్మికులకు సోనూసూద్‌ చేసిన సాయాన్ని ఎవ్వరూ అంత సులువుగా మర్చిపోరు. తనను అభ్యర్థించిన

సోనూసూద్ ఎంతమందికి సాయం చేశారు.. రివీల్ చేసిన నటుడు
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2020 | 12:30 PM

Sonu Sood helping: కరోనా లాక్‌డౌన్ వేళ వలస కార్మికులకు సోనూసూద్‌ చేసిన సాయాన్ని ఎవ్వరూ అంత సులువుగా మర్చిపోరు. తనను అభ్యర్థించిన అందరికీ ఈ నటుడు సాయం చేశారు. ఇంకా చెప్పాలంటే చాలా మంది పాలిట ఓ దేవుడిలా మారారు సోనూసూద్‌. ఈ క్రమంలో ఆయన చేత సాయం పొందిన పలువురు తమ పిల్లలకు, తమ షాపులకు సోనూసూద్‌ పేరు కలిసేలా పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కొంతమంది సోనూసూద్‌పై ట్రోల్స్ చేశారు. మరొకరు చేసిన సాయాన్ని సోనూ తన ఖాతాలో వేసుకుంటున్నారని.. ఈ విషయంలో సోనూ పీఆర్ టీమ్ బాగా వర్క్‌ చేస్తుందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేశారు. వీటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు.

”చిన్నప్పుడు నేను ఓ కథ విన్నా. ఒక సాధు వద్ద అద్భుతమైన గుర్రం ఉండేది. ఒకరోజు అతడి వద్దకు వచ్చిన ఓ బందిపోటు ఆ గుర్రాన్ని తనకు ఇవ్వమని కోరాడు. నిరాకరించిన సాధు దాన్ని తీసుకొని అడవి గుండా వెళ్లాడు. అక్కడ ఓ నడవలేని వృద్ధుడిని గమనించి, గుర్రాన్ని అతడికి ఇచ్చాడు. అయితే గుర్రాన్ని ఎక్కిన వెంటనే ఆ వృద్ధుడు తాను బందిపోటుగా చెప్పుకొని, అక్కడి నుంచి కదిలేందుకు ప్రయత్నిస్తాడు. వెంటనే అతడిని ఆపిన సాధు.. నువ్వు గుర్రాన్ని తీసుకెళ్లు. కానీ దీన్ని నువ్వు నా దగ్గరనుంచి ఎలా సొంతం చేసుకున్నావన్న విషయాన్ని ఎవ్వరికీ చెప్పకు. ఎందుకంటే ప్రజలకు మంచి చేసే వారిపై నమ్మకం పోతుంది అని అంటారు. ఇప్పుడు ఇదే విషయాన్ని నేను ట్రోలర్స్‌కి కూడా చెబుతాను” అని సోనూ చెప్పుకొచ్చారు.

”ఇక తాను ఏం చేయలేదంటూ కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. వారికి ఇదే నా సమాధానం. నేను ఇప్పటివరకు 7,03,246 మందికి సాయం చేశా. వారందరి అడ్రస్, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డు నంబర్లు నా దగ్గర ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన విద్యార్థుల వివరాలు నా దగ్గర ఉన్నాయి. నన్ను ట్రోల్స్ చేసే బదులు, మీరు ఎవరికైనా సాయం చేయండి” అని సోనూ తెలిపారు.

Read more:

నాని సినిమాకు పెరిగిన బడ్జెట్‌..!

ఆర్మీ మేజర్‌గా విజయ్ దేవరకొండ..!