E-Insurance: ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఉంచడాన్ని బీమా నియంత్రణ సంస్థ IRDAI తప్పనిసరి చేసింది. ఇప్పుడు బీమా కంపెనీలు డిజిటల్ బీమాను కూడా జారీ చేయనున్నాయి. అయితే ఇ-ఇన్సూరెన్స్ ఖాతాను ఎలా తెరవాలి.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ ఖాతా అంటే ఈ-ఇన్సూరెన్స్ ఖాతా డీమ్యాట్
బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఉంచడాన్ని బీమా నియంత్రణ సంస్థ IRDAI తప్పనిసరి చేసింది. ఇప్పుడు బీమా కంపెనీలు డిజిటల్ బీమాను కూడా జారీ చేయనున్నాయి. అయితే ఇ-ఇన్సూరెన్స్ ఖాతాను ఎలా తెరవాలి.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ ఖాతా అంటే ఈ-ఇన్సూరెన్స్ ఖాతా డీమ్యాట్ ఖాతా లాగా పనిచేస్తుంది. ఇందులో మీరు మీ అన్ని రకాల బీమా పాలసీలను డిజిటల్ ఫార్మాట్‌లో ఉంచుకోవచ్చు. ఈ ఖాతా IRDA ద్వారా అధికారం కలిగిన బీమా రిపోజిటరీ ద్వారా నిర్వహిస్తుంది . ఈ ఖాతాలో జమ చేసిన పాలసీలను ఒకే క్లిక్‌తో సులభంగా యాక్సెస్ చేయవచ్చు.అలాగే ఇ-ఇన్సూరెన్స్ ఖాతాలో నామినీని నమోదు చేయడం తప్పనిసరి. ఒకవేళ బీమా చేసిన వ్యక్తి లేకుంటే, నామినీ ఈ ఖాతాను స్వాధీనం చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి యాక్సెస్ చేయవచ్చు. మరి ఇక ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏమితో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.