రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కష్టాలు, సలార్‌ రీమేక్‌ రూమర్స్‌ క్లారిటీ, సమంత డిజిటల్‌ డెబ్యూ వాయిదా, టోటల్ టాలీవుడ్ రౌండప్

థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ఆధారంగా తెలంగాణ గవర్నమెంట్..

  • Venkata Narayana
  • Publish Date - 6:01 am, Sat, 6 February 21
రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కష్టాలు, సలార్‌ రీమేక్‌ రూమర్స్‌ క్లారిటీ,  సమంత డిజిటల్‌ డెబ్యూ వాయిదా, టోటల్ టాలీవుడ్ రౌండప్

థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ఆధారంగా తెలంగాణ గవర్నమెంట్‌ ఈ మేరకు జీవో విడుదల చేసింది. సినిమా మేకర్స్‌కి ఇదో గుడ్‌ న్యూస్.

సలార్‌ రీమేక్‌ అంటూ వస్తున్న రూమర్స్‌ పై దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఉగ్రమ్‌ సినిమా కథతోనే ప్రభాస్‌ హీరోగా సలార్‌ను తెరకెక్కిస్తున్నట్టుగా వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. ఈ కథ కేవలం ప్రభాస్ కోసం ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా రెడీ చేశామని చెప్పారు.

ట్రిపులార్‌ స్టార్స్‌ రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ క్లైమాక్స్‌ షూట్‌ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్న యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం విగరస్‌ ప్రాక్టీస్ చేస్తున్నారు స్టార్స్‌. తాజాగా ప్రాక్టీస్‌ సెషన్‌లో చెర్రీ, తారక్‌ మాట్లాడుకుంటున్న ఫోటోల్ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్‌.

సమంత డిజిటల్‌ డెబ్యూ వాయిదా పడింది. ఈ నెల 12 నుంచి స్ట్రీమ్ కావాల్సిన ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌ ఏకంగా సమ్మర్‌కు వాయిదా పడింది. ఈ మేరకు దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ షోలో సమంత నెగెటివ్‌ రోల్‌లో నటించారు.

శ్రుతి హాసన్‌, అమలా పాల్, ఈషా రెబ్బా లీడ్‌ రోల్స్‌లో రూపొందిన యాంథాలజీ పిట్టకథలు. బాలీవుడ్ సూపర్‌ హిట్ లస్ట్ స్టోరీస్‌కి ఇన్సిపిరేషన్‌గా తీసిన ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ రిలీజ్ అయ్యింది. ఈ షో ఫిబ్రవరి 19 నుంచి ప్రీమియర్‌ కానుంది.

హీరో మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న మోసగాళ్లు మూవీ నుంచి థీమ్‌ సాంగ్ రిలీజైంది. డబ్బు చుట్టూ తిరిగే ఈ పాట లిరిక్స్‌ సిరాశ్రీ రాశారు. జెఫ్రీ జీ చిన్ డైరెక్ట్ చేసిన మోసగాళ్లు మూవీలో హీరో సోదరి పాత్రలో కాజల్‌ నటిస్తున్నారు.

సెన్సేషనల్ డైరక్టర్ గుణశేఖర్‌ తీస్తున్న శాకుంతలం మూవీ కోసం అత్యున్నత ప్రమాణాలతో కాస్ట్యూమ్స్‌ డిజైన్స్ చేస్తున్నారు. ఫేమస్ కాస్ట్యూమ్స్ డిజైనర్ నీతా లుల్లా శాకుంతలం మూవీకి వర్క్ చేస్తున్నారు. తలపాగా కట్టడంలో పురాతనమైన టెక్నిక్స్‌ని వాడుతున్నారామె.

అల్లరి నరేష్ హీరోగా విజయ్‌ కనకమేడల డైరెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్‌ నాంది. ఈనెల 19న రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ మూవీ ట్రయిలర్‌ను ఈరోజు సూపర్‌స్టార్ మహేష్‌ విడుదల చేస్తారు. వరలక్ష్మి శరత్‌కుమార్ నాంది మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ మూవీ కాస్టింగ్ పరంగా మరింత వెయిట్ కోసం చూస్తోంది. ఇప్పటికే యాక్షన్ కింగ్ అర్జున్, స్టార్ యాంకర్ అనసయ ఈ మూవీలో నటిస్తున్నారు, తాజాగా.. బాలీవుడ్ నటుడు నికితిన్ ధీర్‌ ఖిలాడీ బోర్డ్‌లో చేరినట్లు తెలుస్తోంది. గతంలో కంచె మూవీలో చేశారు ధీర్.

వైరల్ అవుతున్న వైసీపీ ఎంపీల ఆఫ్ ద రికార్డ్ వీడియోపై బాలశౌరి రియాక్షన్, లోకేశ్‌ పిచ్చి ట్వీట్లు మానుకోవాలని కామెంట్