AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri-Raviteja: స్పీడు పెంచనున్న పూరీ జగన్నాథ్‌… తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ రిపీట్‌ కానున్న క్రేజీ కాంబినేషన్‌..?

Puri Raviteja Movie: 2015లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన 'టెంపర్‌' చిత్రం తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొన్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్‌. వరుసగా ఆరు సినిమాల వైఫల్యం తర్వాత 'ఈస్మార్ట్‌ శంకర్‌' చిత్రంతో...

Puri-Raviteja: స్పీడు పెంచనున్న పూరీ జగన్నాథ్‌... తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ రిపీట్‌ కానున్న క్రేజీ కాంబినేషన్‌..?
Narender Vaitla
|

Updated on: Feb 06, 2021 | 5:45 AM

Share

Puri Raviteja Movie: 2015లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ‘టెంపర్‌’ చిత్రం తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొన్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్‌. వరుసగా ఆరు సినిమాల వైఫల్యం తర్వాత ‘ఈస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అయ్యాడు. మంచి కథ దొరికితే తన సినిమా ఎలా ఉంటుందో నిరూపించుకున్నాడు. ఇక ఈస్మార్ట్‌ శంకర్‌ విజయం తర్వాత కెరీర్‌పై మరింత ఏకాగ్రత పెంచి పూరీ జగన్నాథ్‌.. మరోసారి అదే ఊపును కొనసాగించాలని డిసైడ్‌ అయ్యాడు. ఇందులో భాగంగానే యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండతో ‘లైగర్‌’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వరుస చిత్రాలను లైన్‌లో పెట్టడానికి పూరీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్‌ నాగార్జునతో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే దానిపై తర్వాత మళ్లీ ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా మరో వార్త హల్చల్‌ చేస్తోంది. అదే.. పూరీ తన తర్వాతి చిత్రాన్ని మాస్‌ మహారాజ రవితేజతో ప్లాన్‌ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘ఇడియట్‌’, ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ వంటి సూపర్ హిట్‌ చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే చివరిగా 2012లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో మళ్లీ రవితేజతో ఓ హిట్‌ కొట్టాలనే ఉద్దేశంతోనే పూరీ ఈ సినిమాను లైన్‌లో పెట్టనున్నాడని సమాచారం. ఇక రవితేజ ప్రస్తుతం.. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. పూరీ ‘లైగర్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తికాగానే వీరిద్దరి కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రారంభంకానుందని ఫిలిమ్‌ నగర్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

Also Read: Krack on Aha: ‘ఆహా’లోనూ అదే జోరు.. ‘క్రాక్’ లేపుతోన్న రవితేజ.. పండుగ చేసుకుంటున్న మాస్ జనాలు

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే