AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa: ఆ టాలీవుడ్ హీరో భార్యతో కలిసి కన్నప్ప సినిమాను చూసిన వైఎస్ విజయమ్మ.. వీడియో ఇదిగో

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు ఈరోజు (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు వివిధ భాషల్లోనూ రిలీజైన ఈ డివోషనల్ డ్రామాకు మంచి స్పందన వస్తోంది. పలువురు ప్రముఖులు ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Kannappa: ఆ టాలీవుడ్ హీరో భార్యతో కలిసి కన్నప్ప సినిమాను చూసిన వైఎస్ విజయమ్మ.. వీడియో ఇదిగో
YS Vijayamma
Basha Shek
|

Updated on: Jun 27, 2025 | 7:43 PM

Share

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. మంచు విష్ణు నటన, ప్రభాస్ కామియో అప్పియరెన్స్ సినిమాలో హైలెట్ గా నిలిచాయని అభిమానులు చెబుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూస్తున్నారు. అనంతరం సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ కన్నప్ప సినిమాను వీక్షించారు. శుక్రవారం హైదారాబాద్‌లోని ఏషియ‌న్ మ‌హేశ్ బాబు మాల్‌ కి వెళ్లిన విజయమ్మ, మంచు విష్ణు భార్య విరానికాతో కలిసి క‌న్న‌ప్ప సినిమాను క‌లిసి వీక్షించారు. సాధారణంగా విజయమ్మ పెద్దగా సినిమాలు చూడరు. అయితే ఇప్పుడు కన్నప్ప రిలీజ్ రోజే థియేటర్‌కు వచ్చి సినిమాను వీక్షించడం విశేషం. ఈ సందర్భంగా కన్నప్ప సినిమా పూర్తయిన అనంత‌రం విజయమ్మ థియేటర్ నుంచి బ‌య‌టికి వెళుతున్న వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మంచు విష్ణు భార్య వెరోనికా, వైఎస్ కుటుంబానికి దగ్గరి బంధువు అవుతుంది. ఈ క్రమంలోనే మంచు విష్ణు నటించిన చిత్రాన్ని చూసేందుకు వైఎస్ విజయమ్మ వెరానికాతో కలిసి థియేటర్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో మంచు విష్ణు గాల్లో తేలిపోతున్నాడు. దాదాపు రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్  శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, , యోగి బాబు, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా ఎంతో మంది ఈ సినిమాలో నటించారు. మహా భారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిపి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మించారు. సుమారు రూ. 300 కోట్లతో ఈ మూవీని నిర్మించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ లో ఏఎమ్ బీ మాల్ నుంచి బయటకు వస్తోన్న వైఎస్ విజయమ్మ..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .