AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR 30: స్పీడ్ పెంచనున్న యంగ్ టైగర్.. కొరటాల శివ సినిమా కోసం సిద్దమైన తారక్

యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ ప్రస్తుతం రాజమౌళి సినిమాను కంప్లీట్ చేసి కొరటాల శివ సినిమాకోసం సిద్ధంగా ఉన్నారు.  జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ కొమురం భీమ్ గా కనిపించనున్నాడు

NTR 30: స్పీడ్ పెంచనున్న యంగ్ టైగర్.. కొరటాల శివ సినిమా కోసం సిద్దమైన తారక్
Ntr
Rajeev Rayala
|

Updated on: Jan 22, 2022 | 7:36 PM

Share

NTR 30: యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ ప్రస్తుతం రాజమౌళి సినిమాను కంప్లీట్ చేసి కొరటాల శివ సినిమాకోసం సిద్ధంగా ఉన్నారు.  జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ కొమురం భీమ్ గా కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే ఆర్ఆర్ఆర్ ఇప్పటికి థియేటర్స్ లో సందడి చేస్తూ ఉండేది. కానీ కరోనా కారణంగా అది కుదరలేదు. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు సినిమా తీసుకురావాలని మేకర్స్ భావించారు. కానీ ఇప్పుడు సినిమా ఏప్రిల్ లేదా మార్చ్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తారక్ తన నెక్స్ట్ సినిమా కొరటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ తో ఆచార్య సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. గతంలో కొరటాల , తారక్ కాంబినేషన్ లో జనతాగ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు రాబోయే సినిమా పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి అభిమానుల్లో.

అయితే ఆర్ఆర్ఆర్ కోసం తారక్ మూడేళ్లు టైం కేటాయించారు. దాంతో ఇప్పుడు వీలైనంత స్పీడ్ గా సినిమాలను లైన్ లో పెట్టాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే కొరటాల శివ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడట తారక్. ఇక వచ్చేనెల ఫస్టువీక్ లో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీలు  జాన్వీ కపూర్ .. అలియా భట్ పేర్లతోపాటు  కీర్తి సురేశ్ .. రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: బూరెబుగ్గల బుజ్జాయి.. చిరునవ్వులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?

Nagashaurya: కృష్ణ వ్రింద విహారి అంటోన్న నాగశౌర్య.. బర్త్ డే వేళ స్పెషల్ సర్‏ప్రైజ్..

Manchu Lakshmi: తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ రిక్వెస్ట్.. ఎందుకంటే..

ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే