- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Hamsa Nandini latest photoshoot goes viral
Hamsa Nandini : క్యాన్సర్ తో చేస్తున్న ఈ యుద్ధం జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే..
హంసానందినికి అందం, అభినయం కలగలిపి ఉన్నప్పటికీ హీరోయిన్గా అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. అయితే పలు చిత్రాల్లో కీలక పాత్రలలో
Updated on: Jan 22, 2022 | 8:10 PM

హంసానందిని.. తెలుగు చిత్రపరిశ్రమలో తన నటనతో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్. హంసానందినికి అందం, అభినయం కలగలిపి ఉన్నప్పటికీ హీరోయిన్గా అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది.

పలు చిత్రాల్లో కీలక పాత్రలలో.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది హంసానందిని. అయితే గత కొద్ది రోజుల క్రితం నటి హంసానందిని బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే.

తాను గ్రేడ్ 3 క్యాన్సర్తో పోరాడుతున్నట్టు హంసానందిని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలియజేసింది.

ప్రస్తుతం ఆమెకు కీమోథెరపీ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఓవైపు చికిత్స తీసుకుంటునే ఫోటో షూట్ చేసింది హంసానందిని.

గుండుతో ఉన్న ఈ ఫోటోలలో హంసానందిని ముఖంలో కొన్ని భావాలు కనిపించాయని ఆమెకు స్టైయిలిస్ట్గా చేసిన అమీ పటేల్ అన్నారు.

తాజాగా హంసానందిని ఫోటో షేర్ చేస్తూ ఆమె చాలా అందంగా కనబడుతున్నారని తెలిపింది. “మీ ఫోటో.. బలం, నమ్మకం, అందాన్ని ఆవిష్కరిస్తోంది. ఇప్పుడు క్యాన్సర్ తో మీరు చేస్తున్న యుద్ధం మీ జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే అని అమీ పటేల్ పేర్కోన్నారు.




