AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగాస్టార్ కొడుకుగా నటించే ఛాన్స్ అందుకున్న యంగ్ హీరో..?

మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి సిస్టర్ గా కీర్తిసురేష్ కనిపించనుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో అక్కినేని హీరో సుశాంత్ నటిస్తున్నాడు. వేదలమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్నప్పటికీ ఈ సినిమాలో చాలా మార్పులు చేర్పులు చేశారట దర్శకుడు మెహర్ రమేష్.

Chiranjeevi: మెగాస్టార్ కొడుకుగా నటించే ఛాన్స్ అందుకున్న యంగ్ హీరో..?
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Aug 04, 2023 | 11:22 AM

Share

మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి సిస్టర్ గా కీర్తిసురేష్ కనిపించనుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో అక్కినేని హీరో సుశాంత్ నటిస్తున్నాడు. వేదలమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్నప్పటికీ ఈ సినిమాలో చాలా మార్పులు చేర్పులు చేశారట దర్శకుడు మెహర్ రమేష్. ఈ మూవీలో చిరంజీవి కామెడీ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోతాయని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే విడుదలైన భోళా శంకర్ మూవీ టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 11న రిలీజ్ కానుంది. దాంతో ఫ్యాన్స్ అంతా ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మరో సినిమాను కూడా లైనప్ చేశారట చిరంజీవి. కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు సినిమాలతో హిట్స్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. బ్రో డాడీ  మూవీకి రీమేక్ గా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాలో పలు మార్పులు చేర్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కిస్తున్నారట.ఇప్పటికే కథను సిద్ధం చేసిన కళ్యాణ్ పాత్రలను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవికి ఓ కొడుకు కూడా ఉంటాడని తెలుస్తోంది. మరోసారి తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్ నేపథ్యంలో సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో చిరు కొడుకుగా ఓ యంగ్ హీరో పేరును పరిశీలిస్తున్నారట. ఆ హీరో మరెవరో కాదు శర్వానంద్. శర్వానంద్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో చిరంజీవి నటించిన శంకర్ దాదా సినిమాలోనూ నటించాడు. ఇప్పుడు చిరంజీవి కొడుకుగా నటించే ఛాన్స్ అందుకున్నడని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు .

View this post on Instagram

A post shared by Sharwanand (@imsharwanand)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.150కే ఫైవ్ స్టార్ రేంజ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.150కే ఫైవ్ స్టార్ రేంజ్..
72 ఫోర్లు, 34 సిక్స్‌లు.. 825 పరుగులతో ఇదెక్కడి రచ్చ సామీ
72 ఫోర్లు, 34 సిక్స్‌లు.. 825 పరుగులతో ఇదెక్కడి రచ్చ సామీ
స్కూల్లో LKG విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్.. ఏం జరిగిందంటే?
స్కూల్లో LKG విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్.. ఏం జరిగిందంటే?
ఈ ముసలావిడను గుర్తు పట్టారా? ఒకప్పటి టాలీవుడ్ అందాల తార
ఈ ముసలావిడను గుర్తు పట్టారా? ఒకప్పటి టాలీవుడ్ అందాల తార
రూమ్ హీటర్లతో జాగ్రత్త.. వెచ్చదనం వెనుక పొంచి ఉన్న ముప్పు!
రూమ్ హీటర్లతో జాగ్రత్త.. వెచ్చదనం వెనుక పొంచి ఉన్న ముప్పు!
శనీశ్వరుడికి పరిహారాలు.. 2026లో వారికి కొత్త జీవితం ఖాయం..!
శనీశ్వరుడికి పరిహారాలు.. 2026లో వారికి కొత్త జీవితం ఖాయం..!
క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!
క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!
ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం, కుబేర యోగం!
ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం, కుబేర యోగం!
సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం..
సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం..
అఫీషియల్.. ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఫీషియల్.. ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?