Pawan Kalyan: పవర్ స్టార్ సినిమాల్లో నెక్ట్ వచ్చేది ఈ సినిమానేనా..?
రాజకీయ పరంగా తన ప్రసంగాలతో ఊపేస్తున్న పవన్.. ఇటు సినిమాలతోను తన జోష్ చూపిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటించాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇతర సినిమాల పై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ లైనప్ చేసిన సినిమాల్లో హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. వీటిలో హరిహరవీరమల్లు సినిమా ఇప్పటలో రావడం కష్టంగానే కనిపిస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజకీయ పరంగా తన ప్రసంగాలతో ఊపేస్తున్న పవన్.. ఇటు సినిమాలతోను తన జోష్ చూపిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటించాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇతర సినిమాల పై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ లైనప్ చేసిన సినిమాల్లో హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. వీటిలో హరిహరవీరమల్లు సినిమా ఇప్పటలో రావడం కష్టంగానే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కంటే ముందు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో గబ్బర్ సింగ్ సినిమా ఒకటి ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో మరోసారి పోలీస్ పాత్రలో కనిపించి అలరించనున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమానుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సుజిత్ ఓజీ
ఉస్తాద్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ సగం వరకు షూట్ జరిగిందని తెలుస్తోంది. సాహూ సినిమాతర్వాత సుజిత్ చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.
ఓజీ ముందుకు ఉస్తాద్ వెనక్కు
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి క్రేజీ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ చకచకా కంప్లీట్ చేయనున్నారు. ఈ మూవీ నుంచి త్వరలో గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఉస్తాద్ కంటే ముందుగానే ఓజీ సినిమా థియేటర్స్ లోకి వస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఓజీ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. అలాగే ఉస్తాద్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే అఫీషియల్ అప్డేట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి