Nag Ashwin: ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా..

నాగ్ అశ్విన్ అసిటెంట్ డైరెక్టర్ గా కెరీర్  ప్రారంభించి ఆతర్వాత దర్శకుడిగా మారాడు. మంచు మనోజ్ నటించిన నేను మీకు తెలుసా అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఇక 2015లో వచ్చిన ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా మారారు. నాని , విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి ఈ సినిమాతోనే విజయ్ దేవర కొండ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత మహానటి సావిత్రి జీవిత కథను తెరకెక్కించారు, కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Nag Ashwin: ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా..
Nag Ashwin
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 04, 2023 | 12:11 PM

నాగ్ అశ్విన్.. టాలీవుడ్ లో ఇప్పుడు ఈయన పేరు తెగ వినిపిస్తుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా అయన పేరు మాత్రం ఘాట్ టాపిక్ గా మారిపోయింది. నాగ్ అశ్విన్ అసిటెంట్ డైరెక్టర్ గా కెరీర్  ప్రారంభించి ఆతర్వాత దర్శకుడిగా మారాడు. మంచు మనోజ్ నటించిన నేను మీకు తెలుసా అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఇక 2015లో వచ్చిన ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా మారారు. నాని , విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి ఈ సినిమాతోనే విజయ్ దేవర కొండ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత మహానటి సావిత్రి జీవిత కథను తెరకెక్కించారు, కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కీర్తిసురేష్ నటన ప్రతిఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది. కీర్తిసురేష్ నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. అంతే కాదు ఈ సినిమాలో బోలెడన్ని అవార్డ్స్ వచ్చాయి. 66 వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌లో నాగ్ అశ్విన్ ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు నాగ్ అశ్విన్. అలాగే 2018 ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో “ఈక్వాలిటీ ఇన్ సినిమా అవార్డు”ని కూడా అందుకుంది మహానటి

ఇక ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కల్కీ అనే సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునె హీరోయిన్ గా నటిస్తుండగా.. అబితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమా పై అంచలనను పెంచేశాయి. 2898 లో భూమి ఎలా ఉండబోతుంది. అప్పుడు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాలు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు నాగ్ అశ్విన్.

ఇదిలా ఉంటే కెరీర్ బిగినింగ్ ను సెన్సబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దగ్గర అసిటెంట్ గా పనిచేశారు నాగ్ అశ్విన్. ఆయన లీడర్, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అదే సమయంలో లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. గోల్డ్ ఫేజ్ కుర్రాడిగా కనిపించారు నాగ్ అశ్విన్.Life Is Beautiful

View this post on Instagram

A post shared by IMDb India (@imdb_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి