Naveen Chandra: ‘ఉద్యమమే కాదు.. గొప్ప ప్రేమకథే విరాటపర్వం’.. హీరో నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఎట్టకేలకు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు

Naveen Chandra: 'ఉద్యమమే కాదు.. గొప్ప ప్రేమకథే విరాటపర్వం'.. హీరో నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Naveen Chandra
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 03, 2022 | 8:11 AM

డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం విరాట పర్వం (Virata Parvam). డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్వీ. సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, వీడియోస్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. నక్సలైట్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో రానా.. రవి శంకర్ అలియాస్ రవన్న పాత్రలో.. సాయి పల్లవి వెన్నెల పాత్రలో కనిపించారు. ఇందులోయంగ్ హీరో నవీన్ చంద్ర కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో నవీన్ చంద్ర (Naveen Chandra) మీడియాతో పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు.

విరాటపర్వం సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది అని విలేకరి అడగ్గా. నవీన్ స్పందిస్తూ..” ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు కథలో చిన్న మార్పు తేవడమో, ట్విస్ట్ ఇవ్వడమో లాంటివే చేశాను. కానీ విరాటపర్వంలో మాత్రం పూర్తికథనే తలకిందులు చేసే పాత్రలో కనిపిస్తాను. ఇందులో నా పాత్ర పేరు రఘన్న. సీనియర్ ఉద్యమకారుడిగా కనిపిస్తాను. ఉద్యమం తప్ప దేన్నీ లెక్కచేయను. ఎలాంటి ఎమోషన్‏కి లొంగను. ఈ కారణంతోనే గ్రూప్‏లో సీనియర్‏గా గుర్తింపు దక్కాల్సిన నా పాత్ర జూనియర్ ఉద్యమ కారుడిగా వుంటుంది. ఆ ఈర్ష్య కూడా నా పాత్రలో కనిపిస్తుంది. అలాగే ప్రియమణి గారు భారతక్క పాత్రలో కనిపిస్తారు. మా రెండు పాత్రలు రవన్న పాత్ర పోషిస్తున్న రానాగారికి దగ్గరగా వుంటాయి. మాకు అన్నిటికంటే ఉద్యమం, విధానాలే ముఖ్యం. సాయి పల్లవి గారు వెన్నెల పాత్రలో కనిపిస్తారు. ఉద్యమంతో పాటు ఒక గొప్ప ప్రేమకథ విరాటపర్వంలో వుంది. ఇది వండర్ ఫుల్ మూవీ. దర్శకుడు వేణు ఉడుగుల గారు అద్భుతంగా రాశారు, తీశారు. విరాటపర్వం కోసం చాలా కష్టపడ్డాం. కానీ ఇష్టంగా చేశాం. కొత్తకథని బలమైన పాత్రలతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు వేణు గారు. ఇందులో నేనూ భాగం కావడం ఆనందంగా వుంది. ఇందులో చాలా మంచి పాత్ర నాకు దక్కింది. దాదాపు 35నిమిషాల పాటు నా పాత్ర ఒక బ్లాస్ట్ పేలుతుంది. ప్రతి ఒక్కరికి ప్రశ్నలు సంధిస్తుంది. ఇంత పవర్ ఫుల్ పాత్ర దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది.

మొదటిసారి తెలంగాణ యాసలో చేయడం ఎలా అనిపించింది ?

ఇవి కూడా చదవండి

బళ్ళారి బోర్డర్ కాబట్టి ఆంధ్ర రాయలసీమ ప్రభావం నాపై వుంది. కానీ మొదటిసారి నాతో తెలంగాణ  యాసని అద్భుతంగా చెప్పించారు దర్శకుడు వేణు. డైలాగ్స్ లో కూడా కవిత్వం వినిపిస్తుంది. చాలా డీప్ మీనింగ్ వున్న సంభాషణలు ఇందులో వుంటాయి.  ఈ సినిమా చేయడం నిజంగా ఒక ఛాలెంజ్. చాలా మెమరబుల్ ఇన్సిడెంట్స్ వున్నాయి. అడవిలో ఒక సీన్ చేసినప్పుడు గట్టిగా అరుస్తూ మాట్లాడాలి. గట్టిగా అరిస్తే ఆ సౌండ్ కి ఏనుగులు వస్తాయి. ఒకటి రెండుసార్లు వచ్చాయి కూడా. ఐతే మా పైన ఎలాంటి దాడి చేయలేదు. అతిరపల్లి, వికారబాద్ అడవుల్లో షూటింగ్ చేశాం. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫెన్ రిచ‌ర్డ్‌ నేతృత్వంలో వండర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాం. చాలా అద్భుతమైన టీమ్ వర్క్ చేశాం. ఇలాంటి కథలు, సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఇది నిజంగా జరిగిన కథ , దర్శకుడు వేణు గారికి తెలిసిన కథ, ఆయన ఎక్స్ పీరియన్స్ చేసిన కథ .. అలాంటి కథని తెరపైకి తీసుకురావడంలో అందులో నేను కీలక పాత్ర పోషించడం, నటనకి ఆస్కారం వుండే పాత్ర దక్కడం అదృష్టంగా భావిస్తున్నా ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం