Major Twitter Review: మేజర్ సినిమా కాదు.. ఎమోషన్.. కన్నీళ్లు పెట్టిస్తున్న దేశవీరుడి కథ..

డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్లు సంయుక్తంగా

Major Twitter Review: మేజర్ సినిమా కాదు.. ఎమోషన్.. కన్నీళ్లు పెట్టిస్తున్న దేశవీరుడి కథ..
Major Movie
Follow us

|

Updated on: Jun 03, 2022 | 7:14 AM

మోస్ట్ అవెయిటెడ్ చిత్రం మేజర్ (Major). 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు (జూన్ 3న) తెలుగు, హిందీ, మలయాళం భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇందులో మేజర్ సందీప్ పాత్రలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) నటించగా.. అతని తల్లితండ్రులుగా ప్రకాష్ రాజ్, రేవతి నటించారు. డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రెకర్ కీలకపాత్రలలో నటించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడి జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతమైంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

మేజర్ అంటే సినిమా కాదని.. ఎమోషన్.. మేజర్ సినిమా క్లైమాక్స్ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి కంట కన్నీరు వచ్చిందని.. అడివి శేష్ అద్భుతంగా నటించగా.. డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వం బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మేజర్ ఎమోషనల్ క్లైమాక్స్‌తో అద్భుతంగా తెరకెక్కించారు.. మొత్తం తారాగణం అద్భుతమైన ప్రదర్శన చేశారు. సినిమాటోగ్రఫీ , బిజిఎం నచ్చింది. దర్శకుడు శశి కిరణ్ తిక్క అన్ని జానర్లు/ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయగలడు. శేష్ ఎప్పటికీ అత్యుత్తమం. కచ్చితంగా బాక్సాఫీస్ విజేతగా నిలుస్తాడు.