Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram Twitter Review: ది లయన్ ఈజ్ బ్యాక్.. మరోసారి వెండితెరపై కమల్ హాసన్ నటవిశ్వరూపం..

సినిమాలో తమిళ్ హీరో విజయ్ సేతుపతి, సూర్య, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Vikram Twitter Review: ది లయన్ ఈజ్ బ్యాక్.. మరోసారి వెండితెరపై కమల్ హాసన్ నటవిశ్వరూపం..
Vikram
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 03, 2022 | 7:50 AM

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా విక్రమ్ (Vikram). డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమిళ్ హీరో విజయ్ సేతుపతి, సూర్య, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ మూవీ ఈరోజు (జూన్ 3న) థియేటర్లలో గ్రాండ్‏గా రిలీజ్ అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. మరోసారి వెండితెరపై కమల్ తన నటవిశ్వరూపం చూపించారని.. ది లయన్ ఈజ్ బ్యాక్.. అంటూ కామెంట్స్ చేస్తుండగా.. ఏకంగా ఓ అభిమాని మాత్రం విక్రమ్ సినిమాను బాహుబలి 2తో పోల్చాడు.. అంతేకాకుండా.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్క్రీన్ పై మ్యాజిక్ చూపించాడని ప్రశంసలు కురిపించారు.

విక్రమ్ సినిమా చూస్తే గూస్ బంప్స్ ఓవర్ లోడేడ్.. విజయ్ సేతుపతి, సూర్య, ఫహద్ వంటి స్టార్ నటులను ఓకే స్క్రీన్ పై చూడడం ఎంతో అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్ సీన్స్ బాగున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో హారిష్ ఉత్తమన్, నరైన్, చెంబన్ వినోద్ బోస్ కీలకపాత్రలలో నటించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను బుర్జ్ ఖలీఫా పై ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

ట్వీట్స్..