Major: కథ విన్నప్పుడే కన్నీళ్లు వచ్చాయి.. అందరు చూడాల్సిన చిత్రం.. హీరోయిన్ సాయి మంజ్రేకర్ కామెంట్స్..
మేజర్ చిత్రంలో ఇషా పాత్రలో కనిపిస్తా. మేజర్ సందీప్ కి చిన్ననాటి ప్రేమికురాలిగా, అలాగే సందీప్ భార్యగా కనిపిస్తా. చిన్ననాటి సన్నివేశాల్లో చాలా ప్యూరిటీ వుంటుంది.
డైరెక్టర్ శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మేజర్ (Major). 26/11 ముంబై దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈరోజు (జూన్ 3)న తెలుగు, హిందీ, మలయాళం భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల కీలకపాత్రలలో నటించారు. ఈ క్రమంలో మేజర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల మీడియాతో ముచ్చటించిన హీరోయిన్ సాయి మంజ్రేకర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సాయి మంజ్రెకర్ మాట్లాడుతూ.. “మేజర్ చిత్రంలో ఇషా పాత్రలో కనిపిస్తా. మేజర్ సందీప్ కి చిన్ననాటి ప్రేమికురాలిగా, అలాగే సందీప్ భార్యగా కనిపిస్తా. చిన్ననాటి సన్నివేశాల్లో చాలా ప్యూరిటీ వుంటుంది. ఒక సాదారణ కుర్రాడు అసాదారణ పనులు ఎలా చేశారనేది మేజర్ లో చూస్తారు. నాది నార్త్ ఇండియన్ అమ్మాయి పాత్ర. ఫస్ట్ డే షూటింగ్ లో చాలా కంగారు పడ్డా. తెలుగు సరిగ్గా అర్ధమేయ్యేది కాదు. అయితే ఫస్ట్ షెడ్యుల్ పూర్తయిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎంతలా అంటే మేజర్ లో నా పాత్రకి తెలుగు డబ్బింగ్ కూడా నేనే చెప్పా. ఇషా పాత్రని పోషించడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాలో నా పాత్రకు మంచి గ్రాఫ్ వుంటుంది. 16 ఏళ్ల స్కూల్ గర్ల్ గా కనిపిస్తా, తర్వాత సందీప్ భార్యగా కనిపిస్తా, అలాగే ఒక ఆర్కిటెక్ట్ గా కనిపిస్తా.. ఒకే సినిమాలో ఇన్ని కోణాలు వుండే పాత్ర దక్కడం ఒక అదృష్టం. మేజర్ చిత్రంతో చాలా అంశాలు నేర్చుకున్నాను..
నమ్రత మేడమ్ గారు మా పేరెంట్స్ కి తెలుసు. నమ్రత గారు కాల్ చేసి మేజర్ లో రోల్ గురించి అమ్మకి చెప్పారు. మా నాన్నగారు ఈ సినిమా ఎలా అయినా నువ్వు చేయాలని చెప్పారు. తర్వాత శేష్ గారిని కలిశాం. ఆయన కథ చెప్పినపుడు మా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సినిమా చూసినప్పుడు దాని కంటే పది రెట్ల ఎమోషనల్ అయ్యాం. మేజర్ ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం” అంటూ చెప్పుకొచ్చారు.