Salaar: డార్లింగ్ వల్లే సలార్ షూటింగ్‌కు బ్రేకులు వేసిన డైరెక్టర్.. ఎందుకో తెలుసా?
ఈ ఏడాది ఏప్రిల్ 2022లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ముందుగా సన్నాహాలు చేశారు. చిత్ర నిర్మాతల ఈ ప్లాన్‌ను కరోనా తిప్పికొట్టింది. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది 2023లో విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నారు.
సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’(Salaar)ను ప్రశాంత్ నీల్(Prashant Neel) డైరెక్షన్ చేస్తు్న్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే, ఈ సినిమా గురించి నెట్టింట్లో తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందేంటంటే ప్రభాస్ కారణంగానే ఈ సినిమా షూటింగ్‌కు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట మేరకు ప్రభాస్ సరికొత్త లుక్‌తో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడని, అందుకే ఈ సినిమా ఆలస్యం అయిందని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఫిట్‌గా మరింత ఫిట్‌గా ఉండాలని దర్శకుడు కోరుకుంటున్నాడంట.
‘సలార్’ షూటింగ్‌ను ఆపేసిన ప్రశాంత్ నీల్..
‘సలార్’ చిత్రంలో ప్రభాస్ లీన్ లుక్‌లో కనిపించనున్నాడని, అందుకే ప్రభాస్ బరువు తగ్గాలని, ఈ సినిమాలో ఫిజికల్ టోన్‌లో కనిపించాలని ప్రశాంత్ భావిస్తున్నాడట. ఈ సినిమాలో ఎడిటింగ్ చేసి ప్రభాస్ లుక్ బాగుండాలని ప్రశాంత్ అనుకోవడం లేదు. అందుకే ప్రభాస్ బరువు తగ్గే వరకు సినిమా షూటింగ్ ఆపేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ గురించి మాట్లాడితే, చాలా కాలంగా బరువు విషయంలో డార్లింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు.
2023లో సినిమా విడుదల..
ఈ ఏడాది ఏప్రిల్ 2022లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ముందుగా సన్నాహాలు చేశారు. చిత్ర నిర్మాతల ఈ ప్లాన్‌ను కరోనా తిప్పికొట్టింది. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది 2023లో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. ఇందులో 35 శాతం చిత్రీకరణ పూర్తయింది. గతంలో ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్‌కు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే.